కాబోయే అమ్మలూ.. ఇవీ జాగ్రత్తలు!

మాతృత్వమనేది ప్రతి మహిళకూ ఓ అందమైన, సంతోషకరమైన అనుభూతి. ఆ క్షణాలను ఆస్వాదిస్తూనే... ఆరోగ్యంపైనా దృష్టిపెట్టాలి. అప్పుడే తల్లీ, పుట్టబోయే బిడ్డ... ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు.

Updated : 13 May 2022 15:44 IST

మాతృత్వమనేది ప్రతి మహిళకూ ఓ అందమైన, సంతోషకరమైన అనుభూతి. ఆ క్షణాలను ఆస్వాదిస్తూనే... ఆరోగ్యంపైనా దృష్టిపెట్టాలి. అప్పుడే తల్లీ, పుట్టబోయే బిడ్డ... ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు.

ర్భం దాల్చిన తొలినాళ్లలో వైద్యుల సలహా మేరకు నడకతోపాటు తేలిక వ్యాయామాలనూ చేయొచ్చు. కానీ పొట్ట మీద ఒత్తిడి పెంచే ఎక్సర్‌సైజ్‌లు, పనులకు దూరంగా ఉండాలి. లేదంటే కడుపులో పాపాయికి ఇబ్బంది. వంగి చేసే పనులు, కింద కూర్చుని లేవడం, బరువైన వస్తువులను ఎత్తడం... లాంటివి చేయొద్దు.

ఆహారం.. ఈ సమయంలో చాలామందికి ఒక్కో రకమైన ఆహారంపై ఇష్టం ఏర్పడుతుంది. నచ్చాయి కదా.. అని తరచూ వాటినే తింటే మీకూ, పాపాయికి కావాల్సిన పోషకాలు అందవు. కాబట్టి వాటిని పరిమితంగా తీసుకుంటూనే తాజా పండ్లు, పండ్ల రసాలు, కాయగూరలు, ఆకుకూరలు, తృణ ధాన్యాలు, పాల ఉత్పత్తులకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి.

వస్త్రాలు.. సౌకర్యవంతమైన దుస్తులనే ఎంచుకోవాలి. బిగుతుగా ఉండే వాటి జోలికెళ్లొద్దు. ఇవి అసౌకర్యాన్ని కలిగించడంతోపాటు పాపాయి పెరుగుదలకూ ఇబ్బంది కలిగించొచ్చు. నడుము వద్ద గట్టిగా కట్టుకోవడం, ఎత్తు మడమల చెప్పులు వంటివీ మానుకోవాలి.

ఒత్తిడి వద్దు.. వీలైనంత సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఒత్తిడి బిడ్డ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపగలదు. కాబట్టి, దానికి కారణమయ్యే విషయాలకు దూరంగా ఉండండి. సానుకూలంగా  ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగించే వ్యాపకాలు.. మొక్కల పెంపకం, పాటలు వినడం, పుస్తకాలు చదవడం వంటివి అలవాటు చేసుకోవాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్