అబద్ధాలు చెబుతున్నారా?

పిల్లలు కొన్నిసార్లు అలవోకగా అబద్ధాలు చెప్పేస్తుంటారు. చిన్న విషయాలకే కథలు అల్లేస్తుంటారు. ఇలాంటివి గమనించినప్పుడు చూసీ చూడనట్లు వదిలేయొద్దు. ఆరంభంలోనే ఈ తీరుకి అడ్డుకట్ట వేయాలి అంటున్నారు మానసిక నిపుణులు.

Published : 25 Jul 2021 02:40 IST

పిల్లలు కొన్నిసార్లు అలవోకగా అబద్ధాలు చెప్పేస్తుంటారు. చిన్న విషయాలకే కథలు అల్లేస్తుంటారు. ఇలాంటివి గమనించినప్పుడు చూసీ చూడనట్లు వదిలేయొద్దు. ఆరంభంలోనే ఈ తీరుకి అడ్డుకట్ట వేయాలి అంటున్నారు మానసిక నిపుణులు.

కారణాలు తెలుసుకోండి... అబద్ధం చెప్పారని తెలిసినప్పుడు వెంటనే వారిని తిట్టడమో, కొట్టడమో చేయొద్దు. వారు అలా చెప్పడానికి కారణం తెలుసుకోండి. మంచి ఉద్దేశమే అయినా, ఆకతాయిగా చెప్పినా... నిజం వారంతట వారుగా చెప్పేలా చే యాలి. అప్పుడే వాస్తవం ఎప్పటికీ దాగదని అర్థం చేసుకుంటారు. మళ్లీ ఇలా చేయరు.

మనసువిప్పనివ్వండి... పిల్లలు అబద్ధాలు సులువుగా చెబుతున్నారంటే ముందు మీ ఇంటి వాతావరణం ఎలా ఉందో గమనించండి. ప్రతి చిన్న విషయానికీ కఠినంగా వ్యవహరించినప్పుడు కూడా ఇలా చేస్తారు. అందుకే ఏ విషయాన్నైనా మీతో పంచుకునే స్వేచ్ఛ ఇవ్వండి. అప్పుడే తప్పు చేసినా... మీరు పరిష్కరిస్తారనే ఆలోచనతో నిజమే చెబుతారు.

వారి ముందు అలావద్దు... కొందరు తల్లిదండ్రులు... పిల్లలతో ఇంట్లో ఉండి కూడా లేమని చెప్పిస్తుంటారు. బంధువులు, సన్నిహితుల దగ్గర కొన్ని విషయాలను దాచిపెట్టేందుకు అబద్ధాలూ చెబుతుంటారు. ఇవన్నీ చిన్నారులకు అవకాశంగా మారొచ్చు. తామూ అలా చెప్పినా తప్పులేదనుకోవచ్చు. అందుకే మీరు నిజాయతీగా ఉండటానికి ప్రయత్నించి వారిని మంచి దారిలో నడిపించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్