పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచాలంటే...

కొందరు పిల్లలు బెరుగ్గా, బిడియంగా ఉంటారు. ఆత్మవిశ్వాసమూ తక్కువగా ఉంటుంది. అందుకు అమ్మానాన్నలే బాధ్యత వహించాలి అంటున్నారు నిపుణులు. దాన్ని పెంపొందించడానికి ఏం చేయాలో చెబుతున్నారిలా...

Updated : 05 Jun 2022 04:51 IST

కొందరు పిల్లలు బెరుగ్గా, బిడియంగా ఉంటారు. ఆత్మవిశ్వాసమూ తక్కువగా ఉంటుంది. అందుకు అమ్మానాన్నలే బాధ్యత వహించాలి అంటున్నారు నిపుణులు. దాన్ని పెంపొందించడానికి ఏం చేయాలో చెబుతున్నారిలా...

1. ముందుగా వాళ్లకు వాళ్లు నచ్చేలా తీర్చిదిద్దండి. దానిద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇతరులతో పోల్చకుండా వారికున్న సహజ నైపుణ్యాల్ని గుర్తించి వాటిని మెరుగు పర్చడం మీద దృష్టి పెట్టండి.

2. ఆత్మవిశ్వాసం అంటే ఏదైనా పనిని నమ్మకంగా చేయడమే. అందుకే చిన్నప్పట్నుంచే పనులు చేయడం నేర్పండి. వయసుకు తగ్గ బాధ్యతల్ని అప్పగిస్తుండండి. హోమ్‌వర్క్‌ పూర్తిచేయడం, స్కూల్‌ బ్యాగ్‌ సర్దుకోవడం, షూ పాలిష్‌ చేసుకోవడం... లాంటి వాటితో పాటు ఇంటికి సంబంధించినవీ చిన్న చిన్న పనులు చెప్పండి.

3. పిల్లలు ఏదైనా పని చేయడంలో ఇబ్బంది పడితే వెంటనే మీరు రంగంలోకి దిగిపోవద్దు. కాస్త సమయం ఇవ్వండి.

4. ఇది చెయ్యి, అది చేయొద్దు అని అప్పటికప్పుడ[ు చెప్పకుండా.. ముందే పిల్లల్ని సిద్ధం చేయాలి. అంతే తప్ప అప్పటికప్పుడు వారి మీద కోప్పడటంలో అర్థం లేదు.

5. ఎంతసేపూ నియంత్రించడం, వాళ్లు చేసిన పనులకు నొచ్చుకోవడం కాదు.. అప్పుడప్పుడూ పిల్లల పనుల్ని, ఆలోచనల్ని మెచ్చుకుంటుండాలి కూడా.

ఈ నియమాలూ పాటిస్తే.. మీ పిల్లల్లో తప్పక మార్పు వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని