వివక్ష పోలేదింకా...

స్వాతంత్య్ర అమృతోత్సవాలు చేసుకుంటోన్న భారతావని విద్య, వైద్యం, ఐటీ, అంతరిక్షం... ఇలా ప్రతి రంగంలోనూ గణనీయ పురోగతి సాధించింది. కానీ స్త్రీ, పురుష సమానత్వంలో మాత్రం వెనకబడే ఉందంటోంది అమెరికా సంస్థ ‘ప్యూ థింక్‌ ట్యాంక్‌’ సర్వే. మన దేశంలో 30 వేల మంది పాల్గొన్న ఆ సర్వే వివరాల్ని తాజాగా విడుదల చేశారు.

Published : 08 Mar 2022 01:24 IST

స్వాతంత్య్ర అమృతోత్సవాలు చేసుకుంటోన్న భారతావని విద్య, వైద్యం, ఐటీ, అంతరిక్షం... ఇలా ప్రతి రంగంలోనూ గణనీయ పురోగతి సాధించింది. కానీ స్త్రీ, పురుష సమానత్వంలో మాత్రం వెనకబడే ఉందంటోంది అమెరికా సంస్థ ‘ప్యూ థింక్‌ ట్యాంక్‌’ సర్వే. మన దేశంలో 30 వేల మంది పాల్గొన్న ఆ సర్వే వివరాల్ని తాజాగా విడుదల చేశారు. అందులో వెల్లడైన విషయాలను చూస్తే మహిళల ఆలోచనల్లో మార్పు రావాల్సిన అవసరం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది...

భర్త మాట వినాలి...
సగటు భారతీయ కుటుంబాల్లో.. స్త్రీ, పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ చెప్పే విషయం ఏంటంటే... ‘మహిళలు భర్త మాట వినాలి’. 89 శాతం పురుషులు, 86 శాతం మహిళలు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘పిల్లల బాధ్యత ప్రధానంగా మహిళలదే’ అన్న అంశానికి 24 శాతం మహిళలు, 35 శాతం పురుషులూ ఔనన్నారు.

ఉద్యోగం పురుష లక్షణమే...
ఉద్యోగాల కొరత ఉన్నపుడు మహిళలకంటే పురుషులకే అవకాశాలు ఇవ్వాలని మగవాళ్లతోపాటు ఆడవాళ్లూ అభిప్రాయపడ్డారు. సర్వేలో పాల్గొన్న వారిలో 82 శాతం పురుషులు, 77 శాతం మహిళలు ఈ మాటలు చెప్పారు.

భద్రత బాధ్యత అతడిదే..
మహిళల భద్రత వాళ్ల ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుందనీ, ఈ విషయంలో వాళ్లకి సరైన మార్గనిర్దేశం అవసరమని ప్రతి నలుగురిలో ఒకరు అభిప్రాయపడ్డారు. దాదాపు సగం మంది మాత్రం అమ్మాయిల్ని గౌరవించడం గురించి అబ్బాయిలకే చెప్పాలన్నారు.

లింగ వివక్ష అక్కడ ఎక్కువ...
దేశంలో మహిళల విషయంలో వివక్ష ఉందని 23 శాతం అంగీకరించారు. తెలంగాణాలో ఇది 44 శాతం కాగా తమిళనాడులో 39 శాతం. అభిప్రాయం చెప్పిన మహిళల్ని మాత్రమే తీసుకుంటే జమ్మూ కశ్మీర్‌ (35 శాతం), అసోం(32 శాతం)లలో ఎక్కువ మంది తాము వివక్షకు గురవుతున్నట్టు చెప్పారు.

మగవాళ్లకి తీసిపోరు
రాజకీయాల్లో లింగ సమానత్వం కనుచూపుమేరల్లో లేనట్టు ఈ సర్వే చెబుతోంది. ఓటర్లలో సగం మంది మహిళలే అయినా 2019 లోక్‌సభకు ఎన్నికైన సభ్యుల్లో మహిళలు 14 శాతమే. స్త్రీలు.. మగవాళ్లకు ఏమాత్రం తగ్గకుండా రాజకీయాల్లో రాణిస్తారని 55 శాతం మంది అభిప్రాయపడగా.. మహిళలే ఎక్కువ సమర్థులని 14 శాతం చెప్పడం విశేషం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్