బుజ్జి మస్తకాలకు... వస్త్ర పుస్తకాలు!

బోసినవ్వులను చిందిస్తూ బుడిబుడి అడుగులేసే బుజ్జాయిలకు ప్రత్యేకమీ పుస్తకాలు. పసి పిల్లలకు పుస్తకాలేంటి అని ఆశ్చర్యపోతున్నారా. వీటిలోని రంగులు, అంకెలు, అక్షరాలు, పండ్లు, పూలు, వన్యప్రాణులు, నీటిలోని చేపలు, ఎగిరే పక్షులు పాపాయిలకు ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి.

Updated : 30 Jul 2021 05:49 IST

బోసినవ్వులను చిందిస్తూ బుడిబుడి అడుగులేసే బుజ్జాయిలకు ప్రత్యేకమీ పుస్తకాలు. పసి పిల్లలకు పుస్తకాలేంటి అని ఆశ్చర్యపోతున్నారా. వీటిలోని రంగులు, అంకెలు, అక్షరాలు, పండ్లు, పూలు, వన్యప్రాణులు, నీటిలోని చేపలు, ఎగిరే పక్షులు పాపాయిలకు ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. నిత్య జీవితంలో వాడే వస్తువుల గురించి వీటిలో పొందుపరిచిన బొమ్మలు ఆలోచనాశక్తిని పెంచుతాయి. సుకుమారమైన బుజ్జాయిల చేతిలో ఒదిగిపోయేలా మృదువైన వస్త్రంతో, ఆకర్షణీయమైన వర్ణాలతో ఈ పుస్తకాలు అల్లరి గడుగ్గాయిలకు కొత్త పాఠాలను చెబుతూ మెదడును చురుకుగా మారుస్తున్నాయి. ఇంకెందుకాలస్యం... ఈ సాఫ్ట్‌ క్లాత్‌బుక్స్‌ను మీ పాపాయికీ పరిచయం చేసేయండి మరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్