పూలైతే తోట మీద ఆసక్తి!

అనిత కొత్తగా మారిన ఇంటికి ముందు, వెనుక చాలా చోటు ఉంది. దాంతో పూలు, కూరగాయల మొక్కలను వేసింది. అయితే నెలయ్యే సరికే అన్నీ వాడిపోయాయి. తోట పెంపకంపై ఆసక్తితోపాటు అవగాహన కూడా అవసరం అంటున్నారు నిపుణులు. దీనికి కొన్ని సూచనలిస్తున్నారు.

Updated : 24 Oct 2021 06:39 IST

అనిత కొత్తగా మారిన ఇంటికి ముందు, వెనుక చాలా చోటు ఉంది. దాంతో పూలు, కూరగాయల మొక్కలను వేసింది. అయితే నెలయ్యే సరికే అన్నీ వాడిపోయాయి. తోట పెంపకంపై ఆసక్తితోపాటు అవగాహన కూడా అవసరం అంటున్నారు నిపుణులు. దీనికి కొన్ని సూచనలిస్తున్నారు.

ఎంపిక... మొక్కలను పెంచడానికి ముందుగా అనువైన నేలను ఎంపిక చేసుకోవాలి. లోతైన, నీరు ఇంకిపోయే చోటు మొక్కలకు అనువు కాదు.  ఎదుగుదల తక్కువగా ఉంటుంది. నీడ లేకుండా, ఎండ బాగా పడే ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి. నీటి సౌకర్యమూ ఉండాలి. మొదట్లోనే పెద్దగా కాకుండా చిన్న చోటులో ప్రారంభించడం మంచిది.

అవగాహన...  పెంచాలనుకుంటున్న కూరగాయలు, పూలమొక్కల గురించి అవగాహన పెంచుకోవాలి. ఏయే సీజన్‌లో ఏ తరహా మొక్క పెరుగుతుందో నర్సరీ లేదా నిపుణుల సలహాలను తీసుకోవాలి. వారి సూచనల మేరకు ఇంటికి అవసరమయ్యే కొన్ని కాయగూర విత్తనాలను సేకరించి వేయాలి. అలాగే గులాబీ, మందార వంటి మొక్కలను తోటలో నాటాలి. సీజన్‌ లేకుండా పూసే పూలమొక్కల ఎంపిక కొత్తలో తోట పెంపకంపై ఆసక్తిని పెంచుతుంది.

ఎరువు... కూరగాయలు, పూల మొక్కలకు విడివిడిగా స్థలాన్ని కేటాయించుకోవడం మంచిది. దీంతోపాటు వంటింటి వ్యర్థాలతో సేంద్రియ ఎరువు తయారీని నేర్చుకోవాలి. సాధ్యమైనంతగా రసాయనాలు వాడకుండా ఉండాలి. ఎందుకంటే ఒకసారి రసాయనాలు వేసిన నేల తిరిగి సహజంగా మారడానికి చాలా కాలం పడుతుంది.

కేటాయించాలి... మొక్కలు నాటిన తర్వాత వాటిని రోజూ పరిరక్షించడం మరవ కూడదు. రెండు పూటలా కొంత సమయాన్ని కేటాయించాలి. ప్రత్యేకంగా ఓ పుస్తకంలో ప్రతి మొక్కకు సంబంధించిన వివరాలను పొందుపరుస్తూ ఉండాలి. అవసరమైనప్పుడు వాటిని పునఃపరిశీలించుకోవచ్చు. అలాగే కావాల్సిన వారికి ఆ వివరాలను అందించొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్