చేపలనీళ్లు... మొక్కలకు!

ఇంటి ఆవరణలో ఉన్న కాస్త స్థలంలోనే మొక్కలను పెంచుతున్నారా... వీటికి నీళ్లు సరే మరి ఎరువు మాటేంటి? వంటింటి వ్యర్థాలతోనే సహజ ఎరువును తయారుచేసుకోవచ్చిలా...

Published : 31 Jan 2022 00:59 IST

ఇంటి ఆవరణలో ఉన్న కాస్త స్థలంలోనే మొక్కలను పెంచుతున్నారా... వీటికి నీళ్లు సరే మరి ఎరువు మాటేంటి? వంటింటి వ్యర్థాలతోనే సహజ ఎరువును తయారుచేసుకోవచ్చిలా...

కూరగాయలు కడిగిన/ఉడికించిన నీళ్లు... కొన్నిసార్లు కూరగాయలు ఉడికించిన నీళ్లను వాడుకోకుండా పారబోస్తాం. వీటిలో బోలెడు పోషకాలుంటాయి. ఈ నీటిని చల్లారిన తర్వాత మొక్కకు పోస్తే కావాల్సినంత శక్తి అందుతుంది. అక్వేరియంలోని నీటిని మార్చినప్పుడల్లా ఆ నీరు మొక్కలకు పోస్తే సరి. చేపల వ్యర్థాల నుంచి వెలువడిన నైట్రోజన్‌, పొటాషియం ఈ నీటిలో కలిసి ఉంటుంది. కాబట్టి ఈ నీరు మొక్కలకు పోషకంతో సమానం. కూరగాయ తొడిమెలు, ముక్కలు, ఆకూకూరల కాడలు, ఉల్లిపాయ, వెల్లుల్లి పొట్టు... ఇలా అన్నింటిని ఒక డబ్బాలో వేసి దానిపై కాస్త మట్టిని పోయండి ఇలా ఓ కొన్నిరోజులు నిల్వ ఉంచండి. అంతే సహజమైన ఎరువు తయారు. దీన్ని మొక్కలకు వేస్తే సరి.  ఇంకా చెప్పాలంటే ఎండిన మొక్కల ఆకులూ ఎరువుగా ఉపయోగపడతాయి.

కాఫీ, టీ పొడులు...  టీ కాచిన తర్వాత తేయాకు పారేస్తాం. అలాగే ఫిల్టర్‌ కాఫీ పొడిని కూడా. ఇవి కూడా మొక్కకు ఎరువులా  ఉపయోగపడతాయి. ఈసారి బియ్యం కడిగిన నీళ్లను వృథాగా పారబోయకుండా మొక్కల మొదళ్లలో పోసేయండి. ఇవి మొక్కకు బలాన్నిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్