వీటితో ఇన్ని ఉపయోగాలా?

జిప్‌ టైస్‌ తెలుసా? షాపింగ్‌మాల్స్‌కి వెళ్లినప్పుడు అక్కడ మన హ్యాండ్‌బ్యాగులు తెరుచుకోకుండా ఉండటానికి ఒక ప్లాస్టిక్‌ తీగలాంటిదాన్ని తాళంలా వేస్తారు కదా.... అవే జిప్‌ టైస్‌. నిజానికి వీటితో చాలా ఉపయోగాలు ఉంటాయి....

Published : 09 Mar 2022 01:02 IST

జిప్‌ టైస్‌ తెలుసా? షాపింగ్‌మాల్స్‌కి వెళ్లినప్పుడు అక్కడ మన హ్యాండ్‌బ్యాగులు తెరుచుకోకుండా ఉండటానికి ఒక ప్లాస్టిక్‌ తీగలాంటిదాన్ని తాళంలా వేస్తారు కదా.... అవే జిప్‌ టైస్‌. నిజానికి వీటితో చాలా ఉపయోగాలు ఉంటాయి....

* బ్యాగులు, పిల్లల డ్రెస్సులకున్న జిప్పులు అప్పుడప్పుడు విరిగిపోతుంటాయి. అలాంటప్పుడు ఆ జిప్పులని లాగడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం. అదే జిప్‌టైస్‌ని చిత్రంలో చూపించినట్టుగా వాడి చూడండి. తిరిగి  వాడుకోవచ్చు.

* మనీప్లాంట్‌ వంటి ఇండోర్‌ మొక్కలని బాల్కనీలో పాకిస్తున్నప్పుడు... సాధారణంగా కష్టపడి తీగలు, తాళ్లు లాంటివి ఏవైనా కడుతుంటాం. ఇంత చేసినా అవి వదులయితే పాదులని ఆపలేవు. అలాంటి సందర్భాల్లో ఈ జిప్‌టైస్‌ని వాడి చూడండి. పాదులు మీరు చెప్పినట్టుగా వింటాయి.

* కేబుల్స్‌ లాంటివి చెల్లాచెదురుగా పడి కాలికి తగిలే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు... వాటన్నింటినీ ఒక్కటి చేసి ఈ జిప్‌టైతో కట్టేయండి. ఒక్కచోట ఉంటాయి. ఏ కేబుల్‌ దేనిదో తెలియక ఇబ్బంది పడుతుంటే వేర్వేరు రంగుల జిప్‌టైస్‌ని వాడండి.

* చాకులు, గరిటెలు వంటివాటికి రంధ్రాలున్నా... గోడకు తగిలించుకోవడానికి వీలుగా ఉండవు. అలాంటప్పుడు కూడా ఈ జిప్‌టైస్‌ని వాడుకోవచ్చు. రంధ్రాల్లోంచి జిప్‌టైస్‌ని లాగి రింగుల మాదిరిగా మార్చుకున్న తర్వాత వాటిని సులభంగా గోడకు వేలాడదీయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్