మొక్కలకు చీమలా...?

చీమలు ఇంట్లో ఉండే ఆహారపదార్థాల చుట్టూ చేరి చికాకు పెడుతుంటాయి. ఇంతేకాకుండా తోటలో మొక్కలపై చేరి వాటికీ హాని చేస్తాయి. వీటి బెడద తగ్గించే చిట్కాలివి...

Published : 04 Mar 2024 01:50 IST

చీమలు ఇంట్లో ఉండే ఆహారపదార్థాల చుట్టూ చేరి చికాకు పెడుతుంటాయి. ఇంతేకాకుండా తోటలో మొక్కలపై చేరి వాటికీ హాని చేస్తాయి. వీటి బెడద తగ్గించే చిట్కాలివి...

బేకింగ్‌ సోడా... వంటగదిలో దొరికే బేకింగ్‌ సోడాతో చీమలను రాకుండా చేయొచ్చు. వేపనూనెలో స్పూన్‌ బేకింగ్‌ సోడా వేసి రెండింటినీ కలిపి చీమలు ఉండే ప్రదేశంలో రాయాలి. ఇలా చేయడం వల్ల మొక్కలకు పట్టిన చీమలు పోతాయి.

వైట్‌ వెనిగర్‌... వైట్‌ వినెగర్‌, నీళ్లు సమాన పరి మాణంలో తీసుకుని సీసాలో పోసుకోవాలి. దీన్ని ఇంటి తోటలోని మొక్కల దగ్గర చేరిన చీమలపై పిచికారీ చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు ఈ నీటిని పిచికారీ చేయడం వల్ల చీమలు పోతాయి.

నిమ్మరసంలో... సిట్రస్‌ వాసన చీమలను అరికట్టడానికి సాయపడుతుంది. లీటరు నీటిలో రెండు చుక్కల లవంగ నూనె, కాస్త నిమ్మరసం కలిపి మొక్కలపై స్ప్రే చేస్తే ఈ వాసనకు చీమలు పారిపోతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్