మనకోసం... ఉచితాలు... రాయితీలు!

మనలోని శక్తిసామర్థ్యాలు, ఓపిక, త్యాగనిరతి లాంటి ఎన్నో అంశాలకు గుర్తుగా నిర్వహించేదే మహిళా దినోత్సవం. అదే చెబుతూ బోలెడు విషెస్‌, బహుమతులు అందుకుంటాం కూడా! మీకు మీరూ గిఫ్ట్‌ ఇచ్చుకోండి.

Updated : 05 Mar 2024 14:15 IST

మనలోని శక్తిసామర్థ్యాలు, ఓపిక, త్యాగనిరతి లాంటి ఎన్నో అంశాలకు గుర్తుగా నిర్వహించేదే మహిళా దినోత్సవం. అదే చెబుతూ బోలెడు విషెస్‌, బహుమతులు అందుకుంటాం కూడా! మీకు మీరూ గిఫ్ట్‌ ఇచ్చుకోండి. అందుకు సాయపడేవే ఇవి!

రీరం, మనసు తిరిగి శక్తిని పుంజుకోవాలంటే పర్యటనలను మించింది ఏముంటుంది చెప్పండి. పైగా కొత్త విషయాలనూ తెలుసుకోవచ్చు. ఇదే ఆలోచించినట్లుంది ప్రభుత్వం. అందుకే కొన్ని పురాతన కట్టడాలను ఉచితంగా సందర్శించే అవకాశం కల్పిస్తోంది. దిల్లీలోని ఎర్రకోట తెలుసుగా? లాల్‌ కిలా... రెడ్‌ఫోర్ట్‌గానూ సుపరిచితమైన ఈ కట్టడం యునెస్కో గుర్తింపునీ పొందింది. ఈ కోటను మహిళా దినోత్సవం నాడు దేశ, విదేశీ ఆడవాళ్లెవరైనా ఉచితంగా సందర్శించొచ్చు. ముంతాజ్‌పై ప్రేమకు గుర్తుగా షాజహాన్‌ నిర్మించిన తాజ్‌మహల్‌ కూడా ఈ జాబితాలో ఉంది. ఆగ్రాలోని ఈ ప్రేమ చిహ్నాన్ని ఓసారి సందర్శించేయండి. శతాబ్దాల చరిత్రను నెమరేసుకోవాలనుకుంటే 13వ శతాబ్దంలో నిర్మించిన కుతుబ్‌మినార్‌ దగ్గరికి వెళ్లొచ్చు. యునెస్కో గుర్తింపు పొందిన ఈ వారసత్వ సంపద కూడా మనకు ఉచిత ఆహ్వానమిస్తోంది. ఇంకా... భారత్‌- ఇస్లామిక్‌ ఆర్కిటెక్చర్‌నూ ఆస్వాదించొచ్చు.

ఆటలాడదామా?

చివరిసారిగా ఎప్పుడు ఆడారు? హైస్కూలు స్థాయికి రాగానే చదువుపై దృష్టిపెట్టాలంటూ ఆటలకు దూరమవుతాం. కాలేజీలోనైనా ఆఫీసులోనైనా అడపాదడపానే. పిల్లలు పుట్టాక వాళ్లతో సరదా ఆటలాడినా తరవాత అవి మనకు సరిపడవనుకుంటాం. ఎంతసేపూ ఇల్లు, పని అంటూ కూర్చొంటే బోరు కొట్టదూ? సరదాగా బయటికి వెళ్లండి... చిన్న పిల్లలుగా మారి ఆటలాడేయండి అంటున్నాయి కొన్ని సంస్థలు. విమెన్స్‌ డే రోజున వండర్‌లా ‘ఒకటి కొంటే మరొకటి ఉచితం’ అంటోంటే... రామోజీ ఫిల్మ్‌ సిటీ ఈ నెలంతా ఉత్సవాలు నిర్వహిస్తోంది. టాలెంట్‌ హంట్‌, రెడ్‌ కార్పెట్‌ వెల్‌కమ్‌, ఫ్యాషన్‌ షో వంటి ప్రోగ్రాములే కాదు, రెండు టికెట్లపై రూ.500 తగ్గింపునీ ఇస్తోంది. ‘డే అవుట్స్‌’, ‘నైట్‌ వాక్స్‌’ అంటూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థలూ బోలెడు. కాస్త ఓపికగా చుట్టూ చూడాలంతే!

మనల్నీ పట్టించుకుందాం

ఇంట్లో ఎవరికి చిన్న అనారోగ్యమొచ్చినా గిలగిల్లాడిపోతాం. మన విషయానికొచ్చేసరికి ‘చిన్నదేలే’ అని వదిలేస్తాం. కుటుంబమంతా ఆధారపడేది మనమీదే! అలాంటి మన ఆరోగ్యాన్నే నిర్లక్ష్యం చేస్తే ఎలా? 30 దాటాక ఏటా ఒక్కసారైనా పూర్తి బాడీ చెకప్‌ చేయించుకోవాలి అంటారు నిపుణులు. ఈ ఏడాది నుంచి మొదలుపెట్టేద్దామా? మెట్రోపొలిస్‌ హెల్‌¸్తర్‌, కాంటినెంటల్‌ హాస్పిటల్‌ సహా ఎన్నో ప్రముఖ ఆసుపత్రులు ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తాయి. వాటిని వినియోగించుకొంటే సరి. 

ఎవరి ఇంటికైనా వెళుతున్నా, ఆత్మీయుల ప్రత్యేక సందర్భమేదైనా ‘ఏమిద్దాం’ అని ఆలోచిస్తాం కదా! మీకు మీరు ఎప్పుడైనా బహుమతి ఇచ్చుకున్నారా? ఇప్పుడు ఇచ్చుకోండి. దుస్తుల దగ్గర్నుంచి, యాక్సెసరీలు, బ్యాగులు, వాచ్‌లు, నచ్చిన పరికరాలు... ఇలా అన్నింటిపై అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, బిబా వంటి ఎన్నో సంస్థలు 50-80% వరకు ఆఫర్లు ప్రకటించాయి. ఇంతలోనే కొనుక్కోవాలన్న నిబంధన పెట్టుకుంటే బడ్జెట్‌ దాటుతుందన్న బెంగా ఉండదు. మనసుకీ సంతృప్తి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్