ఉద్వేగాలు అదుపు చేసుకోండి...
ఆడపిల్లలు చిన్న విషయాలకే కళ్ల నీళ్లు పెట్టుకుంటారనే అపవాదు ఉంది. అలాగని బాధలన్నీ మనసులో పెట్టేసుకోమని కాదు... ఉద్వేగాలను ప్రదర్శించే తీరుపై మనకు అదుపు ఉండాలనేది నిపుణుల
ఆడపిల్లలు చిన్న విషయాలకే కళ్ల నీళ్లు పెట్టుకుంటారనే అపవాదు ఉంది. అలాగని బాధలన్నీ మనసులో పెట్టేసుకోమని కాదు... ఉద్వేగాలను ప్రదర్శించే తీరుపై మనకు అదుపు ఉండాలనేది నిపుణుల భావన. అదెలాగంటే...!
* వాస్తవాన్ని అంగీకరించండి: అన్నీ మనం అనుకున్నట్లే జరగకపోవచ్చు. అంతమాత్రాన ప్రపంచమంతా మనకి వ్యతిరేకమని అనుకోవద్దు. చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవడంలో విఫలం అయినప్పుడే భావోద్వేగాలు అదుపు తప్పుతాయి. మాటతూలడం, ఏడవడం వంటివి చేస్తారు. వాటి వల్ల లాభమేమీ ఉండదు. దానికి బదులు ఆ ఇబ్బంది నుంచి బయటపడటానికి దారులు వెతకండి. సన్నిహితుల సాయం తీసుకోండి. బలాలు, బలహీనతల్ని గమనించుకుని కొత్త ఆలోచనలు చేయగలిగితేనే... భావోద్వేగాలపై పట్టు తెచ్చుకోగలరు.
* మనసు విప్పి మాట్లాడండి: ఏం మాట్లాడితే ఎవరేం అనుకుంటారో? నేను చేసేది సరైందో కాదో... అంటూ మీకు మీరే అన్నీ ఊహించుకోవద్దు. మీ ఇబ్బందులు, అనుమానాలు వంటివి సీనియర్లనో, కుటుంబంలో పెద్దవారినో అడిగి తెలుసుకోండి. ఒకవేళ పొరబాటు జరుగుతుంటే... వారి హెచ్చరికల ఆధారంగా మీరు మార్చుకోవచ్చు. దీనివల్ల ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళన, వాటి తాలూకు ఉద్వేగాలు అదుపులో ఉంటాయి.
* ఆధారపడొద్దు: కొందరు ప్రతి చిన్నదానికీ ఎవరో ఒకరి మీద ఆధారపడుతుంటారు. తీరా ఎప్పుడైనా అవతలివారి సహాయ సహకారాలు అందకపోయినా... ఇతరత్రా ఏ ఇబ్బందులు వచ్చినా కుంగిపోతుంటారు. అలా చేయొద్దు. ప్రతి పనీ స్వతంత్రంగా చేయగల నేర్పుని అలవరుచుకోండి. మీ జీవనశైలిలో మార్పులు చేసుకోండి. పోషకాహారం తీసుకోండి. ధ్యానం, యోగా వంటివాటిని మీ దినచర్యలో భాగం చేసుకోండి. ఇవన్నీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. అప్పుడు ఉద్వేగాల మీద మీకు అదుపూ వస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- ఈ వేసవి సమస్యలకు.. ఇలా చెక్ పెట్టేయండి!
- బుజ్జాయిలకూ గ్యాడ్జెట్లు..!
- హెయిర్ డై.. మచ్చలుపడితే..!
- సెరమైడ్స్... మాయ చేసేనా?
- ఫోన్ స్ట్రాప్స్ వాడుతున్నారా?
ఆరోగ్యమస్తు
- అన్నీ తినాలి మరి!
- అందుకే పుచ్చకాయతో పాటు గింజలూ తినాలట!
- నవ్వితే లాభాలెన్నో!
- చెమట వల్ల.. అక్కడ ఇన్ఫెక్షన్లు తలెత్తకుండా..!
- పరగడుపున పండ్ల రసం తీసుకోవచ్చా?
అనుబంధం
- టిక్ టాక్ టో ఆడిద్దామా!
- వద్దంటే.. ఆ విషయం మా ఇంట్లో చెప్తానని బెదిరిస్తున్నాడు..!
- పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా?
- అసహనం వద్దు..!
- ఆడిద్దామా... స్పడ్!
యూత్ కార్నర్
- ఈ అమ్మాయిలు... యునిసెఫ్ అంబాసిడర్లు!
- నవ్వుల మారాణులు!
- ఇద్దరమ్మాయిలు.. కలలు కన్నారు.. సాధించారు!
- స్పాంజ్ టెక్నాలజీతో నీటి వడబోత
- ధనుష్య... వేడుకను చిత్రించేస్తుంది!
'స్వీట్' హోం
- ఇంట్లోనూ... సీతాకోక చిలకల సోయగం...
- కిచెన్‌లో దుర్వాసనలు పోవాలంటే..!
- ఏకాగ్రత పెంచే వామనగుంటలు
- ఎండ వేడిమిని తరిమేసే చల్లని ‘టీ’లు..!
- అక్వేరియం చల్లగా ఉండాలంటే..!
వర్క్ & లైఫ్
- ఆ మౌనానికి కారణం తెలుసా!
- సరదా తప్పులు!
- అతిగా బాధపడుతున్నారా..? ఇలా బయటపడండి..!
- Rashmika: అందుకే అప్పుడు అర్ధరాత్రి ఒంటి గంటకు జిమ్‌కి వెళ్లా!
- అక్కడ మహిళా ఓటర్లదే హవా!