పేచీలు పెడుతున్నారా?

కొందరు చిన్నారులు కోరింది ఇవ్వమని, తామనుకున్నది చేసి తీరాలనీ మంకు పట్టుదలకు పోతుంటారు. ప్రస్తుత లాక్‌డౌన్‌ వల్ల ఇది ఇంకా తీవ్రం అయ్యింది. దీనికి చెక్‌ పెట్టాలంటే!

Published : 18 Jun 2021 00:54 IST

కొందరు చిన్నారులు కోరింది ఇవ్వమని, తామనుకున్నది చేసి తీరాలనీ మంకు పట్టుదలకు పోతుంటారు. ప్రస్తుత లాక్‌డౌన్‌ వల్ల ఇది ఇంకా తీవ్రం అయ్యింది. దీనికి చెక్‌ పెట్టాలంటే!
పెద్దలుగా మనకెంత ఒత్తిడి ఉంటుందో! పిల్లల్లోనూ ఇది అంతే ప్రభావం చూపిస్తుందని అర్థం చేసుకోవాలి. తరచూ ఇలాగే ప్రవర్తిస్తుంటే... వారి మనసు మార్చడానికి ప్రయత్నించాలి. ఇది ఒక్కసారే సాధ్యం కాకపోవచ్చు. ముందు తగిన పోషకాహారం, వ్యాయామం వారికి అందేలా చూడాలి. క్రమంగా...వారి దినచర్యలోనూ మార్పు చేయాలి. అప్పుడే క్రమపద్ధతిలో నడుస్తారు.
* పిల్లలు కోరింది చేయాల్సిందే అని పట్టు పడుతున్నప్పుడు... మీరు అంగీకరించడం మొదలుపెడితే దాన్నే అలుసుగా తీసుకునే ప్రమాదం ఉంది. అందుకే ఏ పని అయినా సులువుగా సాధ్యపడదన్న విషయం తెలియజేయాలి. వాళ్లు అడిగింది చేయాలంటే... మీరు చెప్పింది వారూ చేయాలనే నిబంధన పెట్టండి. ఈ విషయంలో పట్టువిడవనక్కర్లేదు. చిన్నారి ఆ లక్ష్యాన్ని చేరుకుంటే చేయండి. అప్పుడు వారు ఏదైనా అడిగేటప్పుడు సాధ్యాసాధ్యాలను ఆలోచిస్తారు. ప్రతిదాన్నీ కోరేతత్వాన్ని తగ్గించుకుంటారు.
* చిన్నారుల మనస్తత్వంలో మార్పు రావాలనుకుంటే హాబీలను అలవాటు చేయండి. తోటపని, పెయింటింగ్‌, డ్యాన్స్‌, పియానో.... ఇలా ఏదైనా కావొచ్చు.వారికిష్టమైన అంశంలో శిక్షణ ఇప్పించండి. ఇది వారి మనసుని నియంత్రిస్తుంది. దృష్టి మళ్లేలా చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్