ఈ ఐదూ ఆచరించేయండి మరి!
విజయం దరి చేరాలంటే అది క్రమశిక్షణతోనే సాధ్యం. మీరు అనుసరించే అలవాట్లే ఇతరుల నుంచి మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. అవేంటో చూసేయండి...
విజయం దరి చేరాలంటే అది క్రమశిక్షణతోనే సాధ్యం. మీరు అనుసరించే అలవాట్లే ఇతరుల నుంచి మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. అవేంటో చూసేయండి...
ప్రణాళిక... ఏ పని చేయాలన్నా పక్కా ప్రణాళిక ఉండాల్సిందే. ఇంటి పనైనా, ఆఫీస్ వర్క్ అయినా... ఏదైనా సరే... కాబట్టి రేపటికి సంబంధించిన ఇల్లు, ఆఫీస్ పనుల జాబితాను పడుకోబోయే ముందే తయారుచేసి పెట్టుకోండి.
చక్కటి నిద్ర కోసం.. పనులు చేసి అలసిన మనసు, తనువు సేద తీరాలంటే మంచం, దుప్పట్లు, దిండ్లు శుభ్రంగా, చక్కగా అమరి ఉండాలి. గజిబిజిగా, చిందరవందరగా ఉన్న పరుపుపై నిద్ర పట్టదు. ఎంత అలసిపోయినా బెడ్‌ను చక్కగా సర్దుకుంటే ఇది కంటినిండా కునుకు పట్టేలా చేస్తుంది. దాంతో మరింత ఉత్సాహంతో నిద్ర లేస్తారు.
త్వరగా నిద్రలేవడం... విజయకాంక్ష ఉన్న మహిళల డైరీలో ఆలస్యం అనే పదం ఉండదు. వారు సూర్యోదయానికి ముందే నిద్ర లేస్తారు. ఇందుకోసం రాత్రుళ్లు త్వరగా నిద్రపోతారు. కాబట్టి అన్ని పనులు అనుకున్నట్లు జరగాలన్నా... ఆరోగ్యంగా ఉండాలన్నా... త్వరగా నిద్రపోయి, త్వరగా నిద్రలేవాల్సిందే.
5 నిమిషాలు... ముందు రోజు రాత్రే రేపేం చేయాలో ప్రణాళిక వేసుకున్నా లేచిన వెంటనే ఓసారి ఆ జాబితాను నిశితంగా పరిశీలించి వాటిని మెదడులో నిక్షిప్తం చేసుకోవాలి. అందుకోసం లేవగానే ఓ అయిదు నిమిషాలు కేటాయిస్తే సరి. అన్ని పనులతోపాటు మిగిలిన లేదా అదనపు సమయాన్ని కుటుంబం, స్నేహితులతో ఆనందంగా గడపడానికి కేటాయించుకోవాలి.
వ్యాయామం తప్పదు... జీవితంలో విజయం సాధించాలంటే... ముందుగా ఆరోగ్యంగా ఉండాల్సిందే. ఉదయం లేచిన వెంటనే మొదట కనీసం ఓ అరగంట వ్యాయామానికి కేటాయించాలి. దీని వల్ల రోజంతా మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. మీ మెదడు, శరీరం మీ మాట వినాలంటే దానికి రోజూ కచ్చితంగా కసరత్తులు కావాల్సిందే.
అప్పుడే జీవక్రియలు సాఫీగా జరుగుతాయి. మీ దృష్టి మీరు అనుకున్న పనిపై పెట్టగలుగుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- పొడవైన శిరోజాలతో... గిన్నిస్‌బుక్‌లో..!
- తారలు మెచ్చిన ‘ఫుల్కారీ’ ఫ్యాషన్.. ఈ స్టైలిష్ ట్రెండ్ గురించి తెలుసా?
- ఈ ఆహారంతో జుట్టు ఆరోగ్యంగా..!
- మెడ చుట్టూ నల్లగా అవుతోందా?
- గోళ్లు విరుగుతున్నాయా?
ఆరోగ్యమస్తు
- మెనోపాజా... వ్యాయామం చేయండి!
- ఎండకో గొడుగు..!
- చనుబాలు ఎక్కువగా వస్తున్నాయి.. తగ్గేదెలా?
- హార్మోన్లు సమతులంగా ఉండాలంటే..!
- ఎలక్ట్రోలైట్స్... తాగుతున్నారా?
అనుబంధం
- బద్ధకపు భర్తతో వేగలేకపోతున్నారా?
- లవ్ మ్యారేజ్.. అయినా సంప్రదాయాల పేరిట టార్చర్ చేస్తున్నాడు..!
- దాంపత్య బంధానికీ.. ఇవ్వాలి కాస్త విశ్రాంతి!
- బాస్ వివాహేతర సంబంధం.. అతడితో చెప్పాలా? వద్దా?
- నైపుణ్యాలకు సానపెట్టండిలా..
యూత్ కార్నర్
- వేసవి కథ!
- 29 బాటిళ్లతో ఒక స్విమ్‌సూట్.. విదేశాల్లోనూ పాపులర్!
- Prachi Nigam: స్టేట్ ఫస్ట్.. అయినా బాడీ షేమింగ్ తప్పలేదు!
- ప్రాణం కోసం... ‘సూర్య నాయక్’
- Janhvi Kapoor : నచ్చిందే పదే పదే తింటుంటా!
'స్వీట్' హోం
- ఈ డ్రింక్‌తో వేసవి వేడిని తరిమేయండి!
- రాత్రివేళకి... సుగంధాల రాణి!
- చెత్తబుట్ట నుంచి దుర్వాసన రాకుండా..!
- తేలిగ్గా వండేద్దాం..!
- ప్రకృతికి కోపం తెప్పిస్తున్నారా?
వర్క్ & లైఫ్
- గర్ల్ గ్యాంగ్‌తో వెకేషనా? అందాల ‘బాలి’ వెళ్లాల్సిందే!
- రంగులు తెలిసేలా!
- విజయానికి అందం అడ్డయ్యింది!
- భరణం ఇవ్వాల్సొస్తుందని ఉద్యోగం మానేశాడు!
- నేను బాగా పనిచేయడం లేదు!