నిరూపించుకోవడానికి వెనకాడొద్దు!
కార్యాలయంలో ప్రెజెంటేషన్‌లు ఇవ్వడం, సమావేశాలకి సమన్వయకర్తగా పనిచేయడం, వేదికలపై ప్రసంగించడం.. నేటి కార్పొరేట్ సంస్కృతిలో తప్పనిసరి. కానీ చాలామంది అమ్మాయిలు బాధ్యతలు తీసుకోవడానికీ, ముందుండి నడిపించడానికీ వెనుకాడుతుంటారు. ఈ ఇబ్బందిని అధిగమించడానికి కొన్ని సూచనలు చేస్తున్నారు కెరియర్ నిపుణులు.

* మాటలతో ఆకట్టుకోవాలంటే... మాట్లాడే అంశంపై ముందు మనకి పట్టుండాలి. కొంత సాధన చేయాలి. అప్పుడు భయపడకుండా ముందడుగు వేయగలరు.
* మాట్లాడేటప్పుడు ఎదుటివాళ్ల దృష్టిని ఎక్కువగా ఆకర్షించేవి హావభావాలే. మనం చెప్పే విషయాలని ఎలాగూ ఒకటి.. రెండూ.. మూడు.. అంటూ పాయింట్లుగా వివరిస్తుంటాం కదా! ఆ ఒకటి.. రెండు అంటూ చేతివేళ్లనే చూపించండి. చెప్పే విషయాన్ని చేతులతో వ్యక్తపరచండి. దీనివల్ల మీరు చెప్పేది ఏదైనా సరే ఎదుటివారి దృష్టిని మరల్చనీయదు.
* సమావేశాల్లో సమన్వయకర్తగా వ్యవహరించాల్సి వచ్చినప్పుడు... కంగారెందుకు? ప్రణాళికతో ముందుకెళ్తే అన్నీ క్రమ పద్ధతిలో జరిగి పోతాయి. అయితే, దీన్ని నోటిమాటగా అనుకోవద్దు. ఓ పుస్తకంలో మీరు చేయాల్సిన ప్రతి పనీ ప్రారంభం నుంచి చివరి వరకూ రాసుకోండి. స్నేహితుల సాయమూ తీసుకోండి. కచ్చితంగా పూర్తి చేయగలరు.
* ప్రెజెంటేషన్లు ఇచ్చేప్పుడు... అది వీలైనంత సూటిగా ఉండాలి. సింపుల్‌గా గ్రాఫిక్స్, ఇమేజ్‌లతో చూపించగలగాలి. ఇందుకు తగ్గట్లుగా సాధన చేస్తే మీరు సాధించలేనిదంటూ ఏమీ ఉండదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.