క్రీడా కారుణ్యం
కొవిడ్ సెకండ్ వేవ్ ఎంతోమందిపై ప్రభావాన్ని చూపుతోంది. ఎక్కడ చూసినా.. తినడానికి తిండిలేక, ఆక్సిజన్ సిలిండర్లు, పడకలు దొరక్క ఇబ్బంది పడేవారే! అదిచూసి మన క్రీడాకారిణుల మనసూ కదిలింది. ఆటలో ప్రత్యర్థిపైనే కాదు.. కరోనాపై పోరాటానికీ సై అంటున్నారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. వారే.. సానియా మిర్జా, మిథాలీరాజ్, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక. వారి సేవా ప్రయాణాన్ని మనమూ చూద్దామా!
కొవిడ్ సెకండ్ వేవ్ ఎంతోమందిపై ప్రభావాన్ని చూపుతోంది. ఎక్కడ చూసినా.. తినడానికి తిండిలేక, ఆక్సిజన్ సిలిండర్లు, పడకలు దొరక్క ఇబ్బంది పడేవారే! అదిచూసి మన క్రీడాకారిణుల మనసూ కదిలింది. ఆటలో ప్రత్యర్థిపైనే కాదు.. కరోనాపై పోరాటానికీ సై అంటున్నారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. వారే.. సానియా మిర్జా, మిథాలీరాజ్, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక. వారి సేవా ప్రయాణాన్ని మనమూ చూద్దామా!
ఊపిరిలూదాలని..!
సానియా మీర్జా
ఈ ఏడాది ప్రారంభంలో కరోనా బారిన పడి కోలుకుందీ టెన్నిస్ స్టార్. కరోనా కారణంగా చనిపోతున్న వారిని చూసి కదిలిపోయింది. కెట్టో.ఆర్గ్తో కలిసి ‘ఓటూ ఫర్ యూ’ పేరిట నిధులను సేకరిస్తోంది. వీటి ద్వారా ఆక్సిజన్ సిలిండర్లు అవసరమైన వారికి ఉచితంగా అందజేస్తారు. ‘కొవిడ్ సెకండ్ వేవ్ దేశంపై బాగా ప్రభావం చూపింది. ఎంతోమంది ఆక్సిజన్ స్థాయులు పడిపోయి చనిపోతున్నారు. ఆసుపత్రుల బయట చికిత్స కోసం ఎదురు చూసే వారిని చూస్తే చాలా బాధేస్తోంది. బాధితుల బంధువులు ఆసుపత్రిలో పడక, ఆక్సిజన్ సిలిండర్లు, ఖరీదైన మందులు కొనలేక ఇబ్బందులు పడుతున్నారు. వీరందరికీ నావంతుగా సాయం చేయడానికి కెట్టో.ఆర్గ్తో పనిచేస్తున్నా’నంది సానియా.
ఇప్పుడే కాదు.. గత ఏడాదీ లాక్డౌన్లో ఇబ్బందులు పడుతున్నవారిని ఆదుకోవడానికీ నిధులు సేకరించింది. యూత్ ఫీడ్ ఇండియా, సఫా ఇండియాతో కలిసి వారంలోనే రెండున్నర కోట్ల రూపాయలను సేకరించింది. వీటి ద్వారా జీవనాధారం కోల్పోయిన లక్షమందికి ఆహారాన్ని అందించింది.
నిత్యావసర వస్తువులను అందిస్తోంది
మిథాలీ రాజ్
విమెన్స్ టెస్ట్, వన్ డే క్రికెట్ మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్.. సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి అవసరమైన వారికి వంట సరకులను అందిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉపాధి కోల్పోయినవారు, ఆటోడ్రైవర్లకు వాటితో పాటు కొంత నగదునూ అందిస్తోంది. ప్రస్తుతం మిథాలీ ఇంగ్లండ్ టూర్లో ఉంది. కానీ తన తరఫున ఆమె నాన్నతో సరకులు సరఫరా చేయిస్తోంది. వాళ్ల అమ్మ కూడా ఇందులో భాగస్వామ్యం పంచుకుంటోంది. గత ఏడాదీ మిథాలీ పది లక్షల రూపాయలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయ నిధులకు విరాళమిచ్చింది. క్యాబ్ డ్రైవర్లు, చిన్నచిన్న అమ్మకం దార్లకు నిత్యావసర వస్తువులను అందించింది. ‘నిజానికి నేను ఓ ప్రాజెక్టు ప్రణాళికలో ఉన్నాను. లాక్డౌన్ కారణంగా ముందుకు సాగలేకపోయాం. చుట్టూ ఎంతోమంది పడుతున్న ఇబ్బందుల్ని చూసి, మా వంతుగా ఇలా సాయమందిస్తున్నా’మంటోందీ హైదరాబాదీ క్రికెటర్. అర్హులైన పిల్లలకు స్పోర్ట్స్ కిట్లను అందించడం, క్రికెట్ మాత్రమే కాకుండా వారు కోరుకున్న ఇతర ఆటల్లోనూ శిక్షణనిప్పించాలన్నది ఆమె ధ్యేయమట.
ఆటతో సాయం
కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక
వీరిద్దరూ కొవిడ్ బాధితుల సహాయార్థం ఆన్లైన్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లనూ ఆడుతున్నారు. విశ్వనాథన్ ఆనంద్‌తో కలిసి వీటిలో పాల్గొంటున్నారు. ‘చెక్‌మేట్ కొవిడ్’ పేరిట నిర్వహిస్తున్న వీటి ద్వారా వచ్చిన మొత్తాన్ని వైద్య, ఆర్థిక సాయం అవసరమైన బాధితులకు అందజేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా వీరితో ఆడొచ్చు. కాకపోతే ఆడటానికీ, ఆపై కొనసాగించడానికీ కొంత మొత్తాన్ని చెల్లించాలి. 15000 డాలర్ల లక్ష్యంతో దీన్ని మొదలుపెట్టగా 50,000 డాలర్లు అంటే 37 లక్షల రూపాయలకు పైగా సేకరించగలిగారు. హంపి గత ఏడాదీ ఈ నిధుల సేకరణ కార్యక్రమంలో ఆనంద్‌తో కలిసి పాల్గొంది. అప్పుడు నాలుగున్నర లక్షల రూపాయలను సేకరించారు.
హారిక ఆసుపత్రుల్లో పడకల కోసం ప్రయత్నించే వారికోసమూ పనిచేస్తోంది. కొవిడ్ బారినపడిన వారికోసం ‘ఫైండ్ ఎ బెడ్’ పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమానికి ‘కాజ్ అంబాసిడర్’గా వ్యవహరిస్తోంది. దీనిని కొంతమంది యువత ప్రారంభించారు. ఎవరికైనా బెడ్ అవసరమైతే ఆమె తన నెట్‌వర్క్‌తో సంప్రదించి దొరికేలా చేస్తుందట.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- పడుచుకి... పచ్చటి గుత్తుల హారం!
- Summer Tips: జిడ్డు సమస్యా?
- నిమ్మతో నిగనిగలాడే అందం..!
- బేబీ హెయిర్ దాచేద్దాం!
- వీపు మీద పొక్కులా..?
ఆరోగ్యమస్తు
- పంటి నొప్పికి ఎలాంటి చికిత్స అవసరం?
- వేసవిలో ఈ పండ్లు తింటున్నారా?
- ప్రొటీన్ పౌడర్ తాగుతున్నారా?
- వైట్‌డిశ్చార్జ్ అవుతుంటే..!
- నడక నేర్చుకుంటూనే!
అనుబంధం
- యుక్తవయసులో ఆర్థికప్రణాళిక..!
- కప్ప గంతులు వేయించండి!
- నువ్వే సర్వస్వం అన్నాడు.. అక్కడికెళ్లాక మాట మార్చాడు..!
- నాలుగు స్తంభాలాట
- ఆడేద్దామా తొక్కుడు బిళ్ల
యూత్ కార్నర్
- Love Brain Disorder: బాయ్‌ఫ్రెండ్‌కు వందసార్లు ఫోన్ చేసింది.. చివరికి ఏమైందంటే?!
- అక్కడ ఛాంపియన్లని తయారుచేస్తారు!
- డూడుల్ డబ్బా అదిరిందబ్బా!
- Mrunal Thakur: అప్పుడే పెళ్లి చేసుకుంటా.. భవిష్యత్తులో నేనూ దీనికి రడీ!
- పేదరికాన్ని దాటి... చదువుల్లో మెరిసి!
'స్వీట్' హోం
- ఈ మామిడి పండ్ల ఖరీదెంతో తెలుసా?
- ఆయన మొండితనాన్ని భరించలేకపోతున్నా...
- రాగి పాత్రలు మెరిసేలా..!
- చెక్క ఫ్రిజ్‌లు వస్తున్నాయి!
- పిల్లల ముందు ఇలా చేస్తున్నారా.. అయితే జాగ్రత్త!
వర్క్ & లైఫ్
- అక్కడ మహిళా ఓటర్లదే హవా!
- Sonam Kapoor: అప్పుడు 32 కిలోలు పెరిగా.. అయినా ఫీలవలేదు!
- విశ్వ సుందరి పోటీలో అరవయ్యేళ్ల అందం..!
- అక్కడ బిడ్డను కంటే రూ. 60 లక్షల బహుమతి!
- థైరాయిడ్‌తో బరువు పెరిగా...