ఈ అత్తాకోడళ్లు... ఆదర్శ సేవకులు

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన నిర్మల, ఖుష్బూ అత్తాకోడళ్లు. నిర్మల గత 35 ఏళ్లుగా కుట్టు పని చేస్తోంది. కోడలు కూడా అత్త బాటలోనే నడుస్తోంది. కరోనా సమయంలో ఎందరో ఉపాధిని కోల్పోయారు. తిండి లేక పస్తులుంటున్నారు. కొవిడ్‌ వచ్చినవారి పరిస్థితి మరీ దారుణం. ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ లభించక వారు పడుతున్న కష్టాలను చూస్తుంటే కంట నీరు రావాల్సిందే. ...

Published : 28 Jun 2021 01:10 IST

మేమున్నాం

సాధారణంగా అత్తాకోడళ్లకు ఒకరంటే మరొకరికి పడదు అనే భావన ఉంటుంది. సినిమాలు, సీరియళ్లలోనూ అధిక శాతం అలాగే చూపిస్తుంటారు. కానీ, వీరు మాత్రం అందరిలా కాదు.. మానవత్వానికి, మహిళా శక్తికి ఉదాహరణగా నిలుస్తున్నారు.

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన నిర్మల, ఖుష్బూ అత్తాకోడళ్లు. నిర్మల గత 35 ఏళ్లుగా కుట్టు పని చేస్తోంది. కోడలు కూడా అత్త బాటలోనే నడుస్తోంది. కరోనా సమయంలో ఎందరో ఉపాధిని కోల్పోయారు. తిండి లేక పస్తులుంటున్నారు. కొవిడ్‌ వచ్చినవారి పరిస్థితి మరీ దారుణం. ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ లభించక వారు పడుతున్న కష్టాలను చూస్తుంటే కంట నీరు రావాల్సిందే. ఇవన్నీ చూసి ఆ అత్తాకోడళ్ల మనసు చలించింది. బాధితులకు చేతనైనంత అండగా నిలవాలని అనుకున్నారు. తాము దాచుకున్న సొమ్ముతో ఆక్సిజన్‌ సిలిండర్లను కొని అవసరమైన వారికి అందిస్తున్నారు.

అడిగిన వారికి లేదనక... కొవిడ్‌ రోగుల కోసం నిర్మల 74 వేల రూపాయల విరాళాన్ని కలెక్టర్‌కు పంపితే ఆయన వాళ్ల గురించి తెలుసుకుని ఆశ్చర్య పోయారు. ఫోన్‌ చేసి అంతే ఎందుకు పంపారు అని అడిగారు. స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లు అయ్యింది కదా అందుకు గుర్తుగా అని చెప్పారట నిర్మల. ‘ఈ కష్ట సమయంలో ఎంతో మంది సేవ చేస్తున్నారు. మేం కూడా ఎంతో కొంత ఆర్థికంగా అండగా నిలవాలని అనుకున్నాం’ అని చెబుతోంది ఖుష్బూ. కొవిడ్‌ నుంచి కోలుకున్న వారు, కొందరు దాతలు కూడా ఈ అత్తాకోడళ్లకు అండగా నిలుస్తున్నారు. సాయం కోసం ఎవరొచ్చినా.. లేదనకుండా నిత్యావసర సరకులు అందిస్తున్నారు. ఫ్రంట్‌లైన్‌ వారియర్లైన వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్లతో కూడిన కిట్లను పంపిణీ చేస్తున్నారు.

సంకల్పం ఉంటే చాలని..  ‘వాలంటీర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేస్తున్నారు. ఎంతోమంది మాకు అండగా నిలుస్తూ.. మా ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. సంకల్పం ఉన్న మహిళ ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోగలదు’ అని అంటున్నారీ ఈ అత్తాకోడళ్లు. 

- తేరాల రంజిత్‌ కుమార్‌, హైదరాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్