తారల చీరలు కొలువుదీర్చింది

పురాతన నాణేలు, స్టాంపులు, కొత్త నోట్లు.. సేకరించే అలవాటుండటం చూస్తుంటాం. కానీ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన రేపాక భాగ్యలక్ష్మికి చీరలను సేకరించడం అలవాటు.

Published : 20 Jul 2021 00:53 IST

పురాతన నాణేలు, స్టాంపులు, కొత్త నోట్లు.. సేకరించే అలవాటుండటం చూస్తుంటాం. కానీ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన రేపాక భాగ్యలక్ష్మికి చీరలను సేకరించడం అలవాటు. అదీ.. సినిమా కథానాయికలు ధరించినవి. ఆ వివరాలేంటో చూద్దాం రండి.

భాగ్యలక్ష్మి చిన్నప్పటి నుంచి చీరలపై ఆసక్తితో వాటిని సేకరించేది. కథానాయికలు సినిమాల్లో ధరించిన ప్రత్యేక చీరల గురించి ఇంట్లో వాళ్లు, ఇతరులు చర్చించుకోవడం మరింత ఉత్సుకతను కలిగించింది. ఆ చీరలను, వాటిపై ఉన్న చిత్రాలను సొంతగా గీసి అల్లికలు చేయడం ఆరంభించింది. అది క్రమంగా అభిరుచిగా మారింది. తర్వాత ప్రేమ్‌నగర్‌ నుంచి బాహుబలి వరకు... సావిత్రి నుంచి కాజల్‌, అనుష్క వంటి తారలు సినిమాల్లో ధరించిన చీరలను సేకరించింది. అలా 30 ఏళ్లలో పలు హిట్‌ చిత్రాల్లో ప్రాచుర్యం పొందిన చాలా చీరలు ఆమె దగ్గర ఉన్నాయి. ఒకవేళ అవి దొరక్కపోతే అలాంటివే  భర్త రామలింగేశ్వరరావు సాయంతో సూరత్‌, పోచంపల్లి, అహ్మదాబాద్‌, బెనారస్‌, గద్వాల్‌, కంచి వంటి ప్రాంతాల నుంచి తెప్పించుకునేది. కొన్ని తను ధరించినా, చాలావరకూ పాడవకుండా భద్రపరిచింది. ‘చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ చీరలను చూసి సంతోషపడుతుంటారు’ అని భాగ్యలక్ష్మి సంతోషంగా చెబుతున్నారు.

- శ్రీనివాస్‌, పాలకొల్లు, పశ్చిమగోదావరి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్