పారా అథ్లెట్ల కోసం ఓ బార్బీ

పారాలింపిక్స్‌లో ఎందరో అమ్మాయిలు సత్తా చాటుతున్నారు. వాళ్లకి ఇంకాస్త ప్రోత్సాహమందించడానికి ఒక పారాథ్లెట్‌ రూపంలో బార్బీని రూపొందించారు దాని తయారీదారులు. దాని ప్రత్యేకతేంటో చదివేయండి.

Published : 03 Sep 2021 02:57 IST

పారాలింపిక్స్‌లో ఎందరో అమ్మాయిలు సత్తా చాటుతున్నారు. వాళ్లకి ఇంకాస్త ప్రోత్సాహమందించడానికి ఒక పారాథ్లెట్‌ రూపంలో బార్బీని రూపొందించారు దాని తయారీదారులు. దాని ప్రత్యేకతేంటో చదివేయండి.

మ్మాయిలను క్రీడలపరంగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అథ్లెట్లను బార్బీల రూపంలో తయారు చేస్తోందా సంస్థ. మన దేశం నుంచి గతంలో దీపా కర్మాకర్‌, పారాలింపియన్‌ మాన్సీ జోషీలవీ రూపొందించింది. ఈసారి ఫ్రాన్సిస్కా మర్డోన్స్‌ను ఎంచుకుంది.

ఈ పారాలింపియన్‌కి ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నాలుగు ఆటల్లో ప్రావీణ్యం ఉంది. టెన్నిస్‌, షాట్‌పుట్‌, డిస్కస్‌, జావెలిన్‌ త్రోల్లో పాల్గొంది. ఈ ఏడాది చిలీ తరఫున దేశ జెండానీ మోసింది. రియో ఒలింపిక్స్‌తోపాటు ఇతర పారాలింపిక్స్‌ పోటీల్లో కాంస్య, బంగారు పతకాలను గెల్చుకోవడంతోపాటు షాట్‌పుట్‌లో వరల్డ్‌ రికార్డునీ నెలకొల్పింది. ఈ 43 ఏళ్ల మహిళ.. టోక్యో ఒలింపిక్స్‌లోనూ షాట్‌పుట్‌లో బంగారు పతకం సాధించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్