నెలసరిలో శుచిగా, సౌఖ్యంగా...

నెలసరి అత్యంత సహజమని తెలిసినా ఆ ప్రస్తావన వస్తే చాలు అమ్మాయిలు సిగ్గుపడతారు. తప్పుచేసినట్లు భయపడతారు. ఆ సమయంలో ఎదుర్కొనే సమస్యలు ఒకరికి చెప్పుకోలేక అవస్థ పడుతుంటారు. దీన్ని నివారించేందుకు పుట్టిందే ఎకోఫెమే...

Updated : 04 Sep 2021 04:36 IST

నెలసరి అత్యంత సహజమని తెలిసినా ఆ ప్రస్తావన వస్తే చాలు అమ్మాయిలు సిగ్గుపడతారు. తప్పుచేసినట్లు భయపడతారు. ఆ సమయంలో ఎదుర్కొనే సమస్యలు ఒకరికి చెప్పుకోలేక అవస్థ పడుతుంటారు. దీన్ని నివారించేందుకు పుట్టిందే ఎకోఫెమే...

క్కువశాతం మహిళలు డిస్‌పోజబుల్‌ శానిటరీ నాప్‌కిన్లు వాడుతున్నప్పటికీ పేదసాదలకు వాటిని కొనే శక్తి లేదు. చాలామందికి ఆ సమయంలో పరిశుభ్రత పాటించేంత అవకాశం కూడా లేదు. దాంతో అనారోగ్యాలు కొనితెచ్చుకుంటున్నారు. ఈ అంశంపై గ్రామీణ ప్రాంతాల్లో పరిశోధన చేసి జెస్సామిజ్న్‌ మీడెమా, కతీ వాక్లింగ్‌లు 2010లో తమిళనాడులో ఎకో ఫెమేను ఆరంభించారు. పేద మహిళలకు శానిటరీ ప్యాడ్స్‌ ఉచితంగా అందివ్వడం, నెలసరి మీద అవగాహన కల్పించడం, పర్యావరణ పరిరక్షణ దీని లక్ష్యం. సంవత్సరాల తరబడి భూమిలో కరిగిపోకుండా హాని చేసే ప్లాస్టిక్‌ ప్యాడ్స్‌కు ప్రత్యామ్నాయంగా ఉతికి మళ్లీ ఉపయోగించేలా ప్యాడ్స్‌ రూపొందించారు. సాధారణ ప్యాడ్స్‌ ధర ఎక్కువే కాదు, వాడి పడేశాక చెత్తలా పేరుకుపోతుంది. వాటివల్ల ఎందరికో అలర్జీలూ వస్తున్నాయి.
ప్రకృతిసిద్ధమైన రుతుచక్రం ఆడపిల్లల్ని పలు ఇబ్బందుల్లో పడేస్తూ ఆందోళనకు గురిచేస్తోందని, నెలసరిని ఎదుర్కోలేక చాలామంది ఆడపిల్లలు స్కూలు దశలోనే చదువు ఆపేస్తున్నారని ఎకోఫెమే అధ్యయనంలో తేలింది. యుక్తవయసు పిల్లల్లో అవగాహన పెంచి శుభ్రత నేర్పేందుకు ఒక క్వశ్చనీర్‌ తయారుచేశారు. వాటికి జవాబులు రాబట్టినప్పుడు వాళ్లకి గ్రామీణ పేద మహిళలు రుతుచక్రంలో అనుభవిస్తోన్న కష్టాలు తెలిసొచ్చాయి. వాళ్లు ప్యాడ్స్‌ కొనలేరు. కొందరు చవక రకపు ప్యాడ్స్‌ కొని అనారోగ్యం పాలవుతున్నారు. అందుకు ప్రత్యామ్నాయంగా రీయూజబుల్‌ క్లాత్‌ ప్యాడ్స్‌ అందిస్తోంది ఎకోఫెమే. ఇవి ఆరోగ్యానికీ పర్యావరణానికీ కూడా హితమే. ఈ ప్యాడ్స్‌ అనేక కఠిన పరీక్షల అనంతరం దూదితో మెత్తగా, సౌఖ్యంగా, లీక్‌ప్రూఫ్‌తో రూపొందాయి. భిన్న రంగులు, పరిమళాలతో నాణ్యంగా తయారుచేసి 850మంది గ్రామీణ మహిళల ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నారు.

ఎకోఫెమేలో క్లాత్‌ప్యాడ్స్‌ ఎటూ ఉచితమే. ఇక ‘ప్యాడ్‌ ఫర్‌ ప్యాడ్‌’, ‘ప్యాడ్‌ ఫర్‌ సిస్టర్‌’ అంటూ రెండు పద్ధతులున్నాయి. మొదటిది ఎకోఫెమే శానిటరీ న్యాప్‌కిన్‌ కొన్నవాళ్లకి క్లాత్‌ ప్యాడ్‌ ఉచితం. శానిటరీ కోరిన పేదలకు వాటిని తయారుచేసే సరంజామా ఇచ్చి పద్ధతి నేర్పి వారినే చేసుకోమంటారు. సామాజిక, పర్యావరణ మార్పు తేవడమే వారి లక్ష్యం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్