భర్త‘లా’నే.. ఆమే!

దశాబ్దాల వైవాహిక జీవితంలో.. భర్త లక్ష్యంలోనూ తోడుగా నిలవాలనుకున్నారు మోపూరు హరిప్రియ. అందుకే లాయర్‌ అవ్వాలన్న ఆయనకు సాయమవ్వాలని ప్రవేశపరీక్ష రాశారు...

Updated : 23 Oct 2021 05:45 IST

దశాబ్దాల వైవాహిక జీవితంలో.. భర్త లక్ష్యంలోనూ తోడుగా నిలవాలనుకున్నారు మోపూరు హరిప్రియ. అందుకే లాయర్‌ అవ్వాలన్న ఆయనకు సాయమవ్వాలని ప్రవేశపరీక్ష రాశారు. యువతరంతో పోటీపడి మరీ.. రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకులో నిలిచారు. ఆయన సాధించినన్ని మార్కులనే తనూ సాధించడం విశేషం!

రిప్రియది విజయవాడ సమీపంలోని ప్రసాదంపాడు. నెల్లూరులో బీటెక్‌ (ఎలక్ట్రికల్‌) పూర్తి చేశారు. విద్యుత్‌శాఖలో ఏఈగా ఉద్యోగం ప్రారంభించి ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఈఈ)గా గుణదల డివిజన్‌లో పనిచేస్తున్నారు. ఆమె భర్త కేంద ప్రభుత్వ సర్వీసుల్లో ఇంజినీర్‌గా చేసేవారు. ఆయనకు న్యాయ విద్యపై ఆసక్తి. గత ఏడాది ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ చేసి మరీ సన్నద్ధమయ్యారు. 53 ఏళ్ల వయసులో 101 మార్కులతో ర్యాంకు సాధించి, ప్రస్తుతం లా చదువుతున్నారు. భర్తకు సాయమవ్వాలనుకున్నారు హరిప్రియ. లాసెట్‌కి సన్నద్ధత ప్రారంభించారు.

ఉద్యోగం చేస్తూనే రోజూ 3 గంటల పాటు ప్రవేశపరీక్ష కోసం సాధన చేశారు. దీంతోపాటు ‘ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌’లో సర్టిఫికెట్‌ కోర్సునూ పూర్తి చేశారు. ఇతరత్రా శిక్షణ ఏమీ లేకుండా దాదాపు 5 నెలలు సొంతంగా సిద్ధమయ్యారు. భర్తా సాయం చేశారు. ఆయన ప్రయత్నించిన 53 ఏళ్ల వయసులోనే తనూ 101 మార్కులతో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకులో నిలిచారు. యువతరానికి తీసిపోనని నిరూపించారు. న్యాయవిద్య చేశాక భర్తకు సాయంగా ఉంటానంటున్నారు. పేదలకు ఉచితంగా న్యాయ సహాయం అందించటంతోపాటు వాళ్ల హక్కులను కాపాడటానికీ కృషి చేస్తామంటున్నారు. వీరి పిల్లలిద్దరూ విదేశాల్లో ఎంఎస్‌ చేస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్