అంతరిక్షంలోకి తొలి చైనా మహిళ
close
Updated : 03/12/2021 06:05 IST

అంతరిక్షంలోకి తొలి చైనా మహిళ

స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణానికి అంతరిక్షానికి చైనా ముగ్గురు వ్యోమగాములను పంపింది. వాళ్లలో వాంగ్‌యాపింగ్‌ ఒకరు. తాజాగా తన బృందంతో కలిసి అక్కడ నిర్మాణ పనుల్లో పాల్గొంది. అలా అంతరిక్షంలో నడిచిన ఆ దేశపు తొలి మహిళగా చరిత్రకెక్కింది.

చైనా తన దేశం తరఫున స్పేస్‌స్టేషన్‌ నిర్మాణం చేపడుతోంది. అందులో భాగంగా వాంగ్‌యాపింగ్‌ ఈ ఏడాది అక్టోబరు 16న అంతరిక్షానికి చేరుకుంది. వచ్చే ఏడాదికి ఈ పనులు పూర్తికానున్నాయి. ఇందుకోసం ఆరు నెలలపాటు వ్యోమగాముల బృందం అక్కడే ఉండి పనులు చేపడుతుంది. ఇందులో భాగంగా మాడ్యూల్‌ నుంచి బయటకు వచ్చి ఆరున్నర గంటలు తన బృందంతో కలిసి నిర్మాణ పనుల్లో పాల్గొని, తిరిగి మాడ్యూల్‌కు క్షేమంగా చేరుకుంది. దీంతో స్పేస్‌వాక్‌ చేసిన తొలి చైనా మహిళా వ్యోమగామిగా నిలిచిందీమె.

చిన్నప్పటి కల... షాన్‌డాంగ్‌కు చెందిన వాంగ్‌కి బాల్యం నుంచి వ్యోమగామి కావాలని కల. చదువు పూర్తయ్యాక 1997లో పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ఎయిర్‌ ఫోర్స్‌లో చేరి డిప్యూటీ స్వాడ్రన్‌ కమాండర్‌గా విధులు నిర్వహించింది. మే, 2010లో పీఎల్‌ఏ ఆస్ట్రోనాట్‌ డివిజన్‌లో సెకండ్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఆస్ట్రోనాట్‌గా చేరింది. రెండేళ్లకు స్పేస్‌కు సంబంధించిన పలు మిషన్స్‌కు బ్యాక్‌అప్‌ క్రూగా పనిచేసి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుత అవకాశానికి 2019 డిసెంబరులోనే ఎంపికైంది. శిక్షణ అనంతరం ఈ ఏడాది సెప్టెంబరులో అంతరిక్షంలోకి అడుగుపెట్టి, స్పేస్‌వాక్‌ చేసి చైనా నుంచి ఈ అవకాశం దక్కించుకున్న రెండో వ్యోమగామిగానూ నిలిచింది. 41 ఏళ్ల వాంగ్‌కు భర్త, అయిదేళ్ల పాప ఉన్నారు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని