డిస్నీకి తొలి అధినేత్రి
close
Updated : 04/12/2021 06:18 IST

డిస్నీకి తొలి అధినేత్రి

ప్రపంచ ప్రఖ్యాత ‘ద వాల్ట్‌ డిస్నీ’ సంస్థ ఛైర్మన్‌ పదవిని తొలిసారి ఓ మహిళ చేపట్టనున్నారు. 98 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ వినోద దిగ్గజ సంస్థలో ఈ స్థానానికి ఎంపికయ్యారు 67 ఏళ్ల సూసన్‌ అర్నాల్డ్‌. అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థాపించిన ఈ సంస్థ ఫిల్మ్‌ ప్రొడక్షన్‌, టెలివిజన్‌, థీం పార్కులు, యానిమేషన్‌, ఫిల్మ్‌ స్టూడియోలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. ‘ఈ స్థానానికి ఎంపిక చేసి మరింత సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశాన్ని అందించినందుకు బోర్డు సభ్యులకు, ఎన్నో కొత్త అంశాలను తెలుసుకోవడానికి చేయూతనందించిన సి.ఇ.ఒ. బాబ్‌ ఛాపెక్‌కు కృతజ్ఞతలు’ అంటున్న సూసన్‌ మేనేజ్‌మెంట్‌, ఆర్థిక, సౌందర్య ఉత్పత్తుల రంగాల్లో అపార అనుభవశాలి. తన కార్యనిర్వాహక నైపుణ్యాలు, వివిధ సంస్థల అభివృద్ధిలో తను పోషించిన పాత్ర, అందించిన సేవలు ఆమెను ఈ స్థాయికి చేర్చాయి. సూసన్‌ 14 ఏళ్ల నుంచి డిస్నీ బోర్డు సభ్యురాలు, 2018 నుంచీ ఇండిపెండెంట్‌ లీడ్‌ డైరెక్టరు. ‘ద మోస్ట్‌ పవర్‌ఫుల్‌ ఉమెన్‌ ఇన్‌ బిజినెస్‌’ జాబితాల్లో పలు మార్లు నిలిచారు సూసన్‌. వాణిజ్య రంగంలో మహిళల పురోగతి కోసం పని చేసే ‘కేటలిస్ట్‌’ ఎన్జీవోకూ సేవలందించారు. గ్లోబల్‌ ఫెమినైన్‌ కేర్‌ సంస్థ ప్రెసిడెంట్‌గా, ప్రొక్టర్‌ అండ్‌ గాంబుల్‌ ఛైర్‌పర్సన్‌గా, మెక్‌డొనాల్డ్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా, మరికొన్ని అంతర్జాతీయ సంస్థల్లోనూ కీలక బాధ్యతలను నిర్వహించిన స్ఫూర్తిదాయక ప్రస్థానం ఆవిడది.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని