అంతా మహిళలే... ఆస్కార్‌ బరిలో

పదహారేళ్లుగా దళిత మహిళలు అన్నీ తామై నడిపిస్తున్న పత్రిక ‘కబర్‌ లెహరియా’. యూపీలో నడిచే ఈ పత్రిక ఇప్పుడు వార్తల్లోకి రావడానికి కారణం... ‘రైటింగ్‌ విత్‌ ఫైర్‌’ అనే డాక్యుమెంటరీ చిత్రం. కబర్‌ లెహరియాని ...

Published : 23 Dec 2021 00:49 IST

దహారేళ్లుగా దళిత మహిళలు అన్నీ తామై నడిపిస్తున్న పత్రిక ‘కబర్‌ లెహరియా’. యూపీలో నడిచే ఈ పత్రిక ఇప్పుడు వార్తల్లోకి రావడానికి కారణం... ‘రైటింగ్‌ విత్‌ ఫైర్‌’ అనే డాక్యుమెంటరీ చిత్రం. కబర్‌ లెహరియాని నడిపే మహిళా రిపోర్టర్లపై తీసిన చిత్రమే ఇది. రింటూ థామస్‌, సుస్మితాఘోష్‌లు దర్శకత్వం వహించిన ఈ చిత్రం డాక్యుమెంటరీ విభాగంలో ఈ ఏడాది  ఆస్కార్‌బరిలో నిలవడం విశేషం. ‘నెలకి అరకోటి మందికిపైగా చేరువయ్యే ఈ పత్రిక వెనుక పాతిక మంది మహిళల కష్టం ఉంది. లింగవివక్ష అధికంగా ఉండే యూపీ, మధ్యప్రదేశ్‌లలో జరిగే వార్తల ఆధారంగా ఈ పత్రిక వెలువడుతుంది. ఇలాంటి ప్రాంతంలో కులవివక్షను తట్టుకుని వార్తలు సేకరించడం అంత తేలికైన విషయం కాదు. వారిచ్చిన స్ఫూర్తితోనే ఈ డాక్యుమెంటరీని నిర్మించాం. ఈ క్రమంలో ఎంతోమంది అత్యాచార బాధితులని, గృహహింసబాధితులని కలిసి ఎన్నో నెలలు కష్టపడి ఈ చిత్రాన్ని తీశాం’ అన్నారు దిల్లీలోని జామియామిలియా యూనివర్సిటీలో మాస్‌కమ్యునికేషన్‌లో డిగ్రీ చేసిన రింటూథామస్‌.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్