వెదురుతో జీవితాలు మార్చేస్తోంది

పర్యావరణ హితమైన వాటితో ఫ్యాషన్‌’ నినాదంగా పనిచేస్తోంది.. ప్రియదర్శిని దాస్‌. ఈమెది భువనేశ్వర్‌. గృహిణి. వాతావరణంలో ఆకస్మిక మార్పులు, నిరుద్యోగం, వలసలు వంటివి ఆమెను ఆలోచింపజేసేవి. ఆమె భర్త డిజైనింగ్‌

Updated : 05 Feb 2022 05:17 IST

ర్యావరణ హితమైన వాటితో ఫ్యాషన్‌’ నినాదంగా పనిచేస్తోంది.. ప్రియదర్శిని దాస్‌. ఈమెది భువనేశ్వర్‌. గృహిణి. వాతావరణంలో ఆకస్మిక మార్పులు, నిరుద్యోగం, వలసలు వంటివి ఆమెను ఆలోచింపజేసేవి. ఆమె భర్త డిజైనింగ్‌ సంస్థలో ప్రొఫెసర్‌. ఆయననుంచి మెలకువలు నేర్చుకుని వెదురుతో వివిధ వస్తువులు రూపొందించేది. చెవి దిద్దుల నుంచి జుంకీలు, నెక్లెస్‌లు, హెయిర్‌ క్లిప్‌లు, రాఖీ, ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌.. ఇలా ఎన్నో రకాలు చేసేది. ఆన్‌లైన్‌ వేదికల ద్వారా వాటికి ఆదరణ లభించింది. దీంతో కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన గ్రామీణ మహిళలు, యువతులకు వీటి తయారీ నేర్పించడం మొదలుపెట్టింది. తర్వాత వాళ్లతో దేశవ్యాప్తంగా స్టాల్స్‌ పెట్టిస్తోంది. తద్వారా నెలనెలా రూ.20,000 వరకూ సంపాదించుకునేలా చేస్తోంది. పర్యావరణ హితంతోపాటు ఎంతోమందికి ఉపాధి మార్గం చూపిస్తున్న ఆమె ఆలోచన అభినందనీయమే కదూ..!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్