వయసు 64... పతకాలు 200

లక్ష్యానికి వయసు అడ్డుకాదని నిరూపించిందామె. ఆమెలోని క్రీడాసక్తి ఆరు పదులు దాటినా...గెలుపు వైపు దూసుకెళ్లేలా చేస్తోంది. నచ్చిన క్రీడను ఎంచుకోవడమే కాదు, తన కృషి, పట్టుదలతో

Published : 03 Mar 2022 01:32 IST

లక్ష్యానికి వయసు అడ్డుకాదని నిరూపించిందామె. ఆమెలోని క్రీడాసక్తి ఆరు పదులు దాటినా...గెలుపు వైపు దూసుకెళ్లేలా చేస్తోంది. నచ్చిన క్రీడను ఎంచుకోవడమే కాదు, తన కృషి, పట్టుదలతో స్వర్ణపతకాలనూ కైవసం చేసుకుంటోంది. ఆమే కర్నాటకకు చెందిన

భవానీ జోగీ..

భవానీ జోగీకి స్వస్థలం. చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఇష్టం. కానీ నర్సుగా పనిచేస్తున్న భవానీ తల్లికి మాత్రం ఆటలంటే అసలు గిట్టేది కాదు. ‘ఇలా ఆటలు ఆడుకుంటే కూర్చుంటే చదువు అటకెక్కుతుంది’ అని హెచ్చరించేది. అలా భవానీతో నర్సు కోర్సు పూర్తిచేయించింది. ఈమెది హస్సన్‌ జిల్లాలోని సక్లేష్‌పుర్‌ 1982లో మైసూర్‌లో కేఆర్‌ ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాతి ఏడాదికే పెళ్లి అయ్యి ఆడపిల్లకు జన్మనిచ్చింది భవానీ. అయినా ఆటల పట్ల తనకున్న మక్కువని మాత్రం చంపుకోలేకపోయింది. దాంతో పనిచేసే విభాగం తరఫున క్రీడల పోటీలు జరిగితే వాటిలో పాల్గోవడం మొదలుపెట్టింది. దీనికి భర్త, ఆడపడుచు తమ వంతు ప్రోత్సాహాన్ని అందించేవారు. దాంతో పూర్తిగా క్రీడల్లో అడుగుపెట్టాలనుకొని శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది.

సాధనతో...

ఆసుపత్రి తరఫున జరిగే త్రోబాల్‌, డిస్క్‌ వంటి పోటీల్లో చురుగ్గా పాల్గొనే భవానీకి మంగళూరు వెన్‌లాక్‌ ఆసుపత్రికి బదిలీ అయ్యింది. ‘అక్కడ ఉదయం పూట సాధన చేయడానికి సమయం ఉండేది కాదు. దాంతో జాగింగ్‌, చిన్నచిన్న వ్యాయామాలతోనే సరిపెట్టుకునేదాన్ని. 1989లో మా వారు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లారు. చికిత్స ఫలించక చనిపోయారు. అప్పటికి మా పాప చిన్నది. ఆ పరిస్థితుల్లో దాన్ని చూసుకోవడానికి ఎవరూ లేక పోటీలకు వెళ్లడం, సాధన చేయడంవంటివన్నీ పూర్తిగా మానేశా. ఇంటి బాధ్యతలన్నీ నేనే చూసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో స్నేహితులు, బంధువులు, సహోద్యోగులు, నాపై ఆఫీసర్స్‌ అందించిన చేయూత మరవలేనిది. తిరిగి నన్ను క్రీడల్లో పాల్గోడానికి ప్రోత్సహించారు. అలా తిరిగి నాకిష్టమైన రంగంలో అడుగుపెట్టగలిగా. నా 40వ ఏట మా అమ్మాయితోపాటు స్విమ్మింగ్‌లో చేరా. అతి కొద్దికాలంలోనే నేషనల్‌ టోర్నమెంట్‌లో పాల్గొనే అవకాశాన్ని సంపాదించుకున్నా. అలా జాతీయస్థాయిలో మూడు స్వర్ణ పతకాలను సాధించగలిగా. అలాగే ఈతలో పిల్లలకు, పెద్దవాళ్లకు శిక్షణ అందించేదాన్ని. 1998లో ఓపెన్‌ మాస్టర్స్‌లోకి ప్రవేశించి 100 బంగారు, 70 వెండి పతకాలను దక్కించుకున్నా. ఉద్యోగాన్నీ నిర్లక్ష్యం చేయలేదు. నర్సింగ్‌ సూపరింటెండెంట్‌గా 2017లో ఉద్యోగవిరమణ చేశా. ఆ తర్వాత కూడా పోటీలకు హాజరవుతూనే ఉన్నా. ఇటీవల శ్రీలంకలో జరిగిన 35వ యాన్యువల్‌ మాస్టర్స్‌ (ఓపెన్‌) అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని మూడు స్వర్ణాలు, ఒక వెండి పతకాన్ని గెలిచా. శక్తి ఉన్నంతవరకు దేశం తరఫున పోటీలకు వెళ్లి పతకాలు తెస్తూనే ఉంటా’ అని చెబుతున్న ఈ 64 ఏళ్ల భవానీ ఇప్పటివరకు ఈత సహా పలురకాల క్రీడల్లో 200 పతకాలకు పైగా గెలిచి తనలాంటి మహిళల్లో స్ఫూర్తిని నింపుతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్