మన ‘పద్మం’ వికసించిందిలా...

ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలకు ప్రవాస భారతీయులు సీయీవోలుగా నియమితులవుతున్న వార్తల్ని తరచూ వింటూనే ఉన్నాం. అక్కణ్నుంచి ఒకడుగు ముందుకు వేసి ఆంత్రప్రెన్యూర్‌గా మారారు పద్మశ్రీ(ఎల్లేపెద్ది) వారియర్‌. పుస్తకాలు

Published : 05 Mar 2022 00:51 IST

ఏ దేశమేగినా...

ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలకు ప్రవాస భారతీయులు సీయీవోలుగా నియమితులవుతున్న వార్తల్ని తరచూ వింటూనే ఉన్నాం. అక్కణ్నుంచి ఒకడుగు ముందుకు వేసి ఆంత్రప్రెన్యూర్‌గా మారారు పద్మశ్రీ(ఎల్లేపెద్ది) వారియర్‌. పుస్తకాలు చదవడానికీ, పుస్తక ప్రియులు అభిప్రాయాల్ని పంచుకోవడానికి వీలైన ‘ఫ్యాబుల్‌’ యాప్‌ను ప్రారంభించారీమె. పద్మశ్రీ పుట్టి పెరిగింది విజయవాడలో. ఇక్కడి మేరీస్‌ స్టెల్లా కాలేజీలో చదువుకున్నారు. ఐఐటీ దిల్లీ నుంచి కెమికల్‌ ఇంజినీరింగ్‌, కార్నెల్‌ యూనివర్సిటీ నుంచి కెమెస్ట్రీలో మాస్టర్స్‌ పూర్తిచేశారు.  మోటరోలాతో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి కంపెనీ సీటీవో స్థాయికి ఎదిగారు. 2007-15 మధ్య సిస్కోకు సీటీవోగా, ఆపైన చైనాకు చెందిన ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ కంపెనీ ‘ఎన్‌ఐఓ’ అమెరికా విభాగానికి సీయీవో(2015-18)గా పనిచేశారు. తర్వాత కార్పొరేట్‌ రంగంలోనే అవకాశాలు వచ్చినా వదులుకుని సొంతంగా ఏదైనా చేయాలనుకున్నారు. ఆర్నెళ్లు విరామం తీసుకుని పెయింటింగ్‌ వేశారు, పర్యటనలు చేశారు, ఎన్నో పుస్తకాలు చదివారు. అప్పుడే ‘ఫ్యాబుల్‌’ ఆలోచన వచ్చిందామెకు. చదువరి అయిన పద్మశ్రీ... టెక్‌ అనుభవాన్నీ జోడించి ఈ యాప్‌ను తీసుకొచ్చారు. అనతికాలంలోనే దీనికి మంచి ఆదరణ లభించింది. మహిళలు కెరియర్‌లో ఉన్నత స్థానాలను చేరుకోవాలంటే.. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉండాలంటారీమె. ‘మీరేం చేయగలరో, ఏం చేయలేరో వేరొకరు చెప్పేలా కాకుండా, ఏ విషయాన్నైనా మీరే చెప్పుకోగలగాలి. రోజు, వారం, నెలకు తగ్గట్టు ప్రణాళికలు వేసుకుంటే లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు. అనుభవం కంటే కూడా నేర్చుకునే స్వభావం విలువైంది’ అంటూ యువతరానికి మార్గనిర్దేశం చేస్తారు పద్మశ్రీ. మానసిక ఆరోగ్యానికీ, కెరియర్‌ నిర్మాణానికీ పుస్తక పఠనం మేలు చేస్తుందంటారు. ప్రఖ్యాత రచయిత ఐజాక్‌ అసిమోవ్‌ రచనలు, ముఖ్యంగా రోబో సిరీస్‌ తాను ఇంజినీరింగ్‌ ఎంచుకునేలా చేశాయని చెప్పే పద్మ.. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌, స్పాటిఫై బోర్డులలో డైరెక్టర్‌ కూడా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్