వెబినార్‌కు ఆహ్వానం

మరో అడుగు ముందుకు వేద్దాం... భవిష్యత్తుని బంగారుమయం చేసుకుందాం అనుకొనే వనితామణులకు సాదర ఆహ్వానం. మహిళా దినోత్సవం సందర్భంగా ఈనాడు - వసుంధర ‘లింగవివక్షను అధిగమిద్దాం’ అంశంపై ఇవాళ వెబినార్‌ నిర్వహిస్తోంది.

Published : 06 Mar 2022 01:10 IST

రో అడుగు ముందుకు వేద్దాం... భవిష్యత్తుని బంగారుమయం చేసుకుందాం అనుకొనే వనితామణులకు సాదర ఆహ్వానం. మహిళా దినోత్సవం సందర్భంగా ఈనాడు - వసుంధర ‘లింగవివక్షను అధిగమిద్దాం’ అంశంపై ఇవాళ వెబినార్‌ నిర్వహిస్తోంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.45 వరకూ సాగే ఈ వెబినార్‌లో వి-హబ్‌ సీఈఓ దీప్తి రావుల అంకుర సంస్థల్లో ఉపాధి అవకాశాలపై ప్రసంగిస్తారు. లావిన్‌స్పైర్‌ సీఈఓ-లైఫ్‌ అండ్‌ బిజినెస్‌ కోచ్‌ డా. మధురిమారెడ్డి మహిళా సాధికారత, సెల్ఫ్‌డిస్కవరీ వంటి అంశాలపై మాట్లాడతారు. మాదాపూర్‌ డీసీపీ కె.శిల్పవల్లి పనిచేసే చోట ఎదురయ్యే సవాళ్లని అధిగమించడం ఎలాగో వివరిస్తారు. మరో వక్త.. తెలంగాణా ప్రభుత్వ చీఫ్‌ ఇన్నొవేషన్‌ ఆఫీసర్‌ డా.శాంతా తౌటం మీ కలలని సాకారం చేసుకోవడమెలానో నేర్పిస్తారు. ఈ వెబినార్‌లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్న వారికి లింకును వారి మెయిల్‌, ఫోన్లకు పంపాము. ఆసక్తి ఉన్న వారు www.eenadu.netలో వెబినార్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌ను వీక్షించవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్