అక్కడ అంతా నారీమణులే...

ఫ్యూచర్‌ సప్లై చెయిన్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌(ఎఫ్‌ఎస్‌సీ)... దేశంలోనే అతిపెద్ద లాజిస్టిక్స్‌ సంస్థల్లో ఒకటి. ప్రముఖ వ్యాపారి కిషోర్‌ బియానీకి చెందిన ఈ సంస్థ నాగ్‌పుర్‌ శాఖని మొత్తం మహిళా సిబ్బందే నిర్వహిస్తున్నారు. లింగసమానత్వానికి ...

Published : 07 Mar 2022 00:14 IST

ఫ్యూచర్‌ సప్లై చెయిన్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌(ఎఫ్‌ఎస్‌సీ)... దేశంలోనే అతిపెద్ద లాజిస్టిక్స్‌ సంస్థల్లో ఒకటి. ప్రముఖ వ్యాపారి కిషోర్‌ బియానీకి చెందిన ఈ సంస్థ నాగ్‌పుర్‌ శాఖని మొత్తం మహిళా సిబ్బందే నిర్వహిస్తున్నారు. లింగసమానత్వానికి పెద్దపీట వేసే ఉద్దేశంతో ఈ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించింది ఎఫ్‌ఎస్‌సీ. మహిళాశక్తికి ప్రతీకగా ఈ కేంద్రానికి ‘శక్తి’ అని పేరు పెట్టారు. ఈ కేంద్రంలో ఉండే ట్రాన్స్‌పోర్ట్‌, వేర్‌హౌస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌, సాఫ్ట్‌వేర్‌ విభాగాల్లో పనిచేసేదంతా మహిళలే. ఈ సంస్థ బెంగళూరు శాఖ బాధ్యతల్ని ఓ మహిళ నిర్వహిస్తూ ఉండటమే కాకుండా, ఉత్పత్తి, విక్రయాల్లో ఆ శాఖను ముందుండేలా చేయడం సంస్థ యాజమాన్యాన్ని ఆశ్చర్యపరిచింది. ఆమె స్ఫూర్తితో మొత్తం మహిళలకే ఓ శాఖను అందించాలనుకున్నారు. దాంతో గతేడాది నాగ్‌పూర్‌లో ప్రత్యేకంగా ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందులో విధుల కోసం పరిసర గ్రామాల్లో అర్హత ఉన్న 100 మంది మహిళల్ని ఎంపిక చేసుకున్నారు. ఇక్కడ ఆహార రంగ ఉత్పత్తుల సరఫరాకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ప్రారంభించిన అతి కొద్దికాలంలోనే దీన్ని లాభాలబాట పట్టించారు సిబ్బంది. అంతేకాదు, మిగతా కేంద్రాల్లోనూ సాంకేతికతతోపాటు వేర్‌హౌస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌, ఆటోమేషన్‌ ఆపరేషన్స్‌ తదితర విభాగాలన్నింటిలోనూ లింగవివక్ష లేకుండా మహిళల్నీ పెద్ద సంఖ్యలో చేర్చుకుంటున్నారు. వేతనాల్లోనూ సమానత్వాన్ని చూపిస్తోంది. 2006లో ప్రారంభమైన ‘ఎఫ్‌ఎస్‌సీ’ ప్రస్తుతం 29 రాష్ట్రాలు, అయిదు కేంద్రపాలిత ప్రాంతాల్లో 136 శాఖలతో పనిచేస్తోంది. భవిష్యత్తులో ప్రారంభించే మరో కేంద్రాన్నీ మొత్తం మహిళా సిబ్బందితోనే నిర్వహించాలనే ఆలోచనలో ఉంది యాజమాన్యం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్