శానిటరీ బెల్ట్‌ కనిపెట్టి..

మనం వాడే మాయిశ్చర్‌ ప్రూఫ్‌, జరగకుండా, అంటించుకోగల శానిటరీ ప్యాడ్‌లు బీట్రిస్‌ కెన్నర్‌ చలవే అని చెప్పొచ్చు. తన పూర్తిపేరు.. మేరీ బీట్రిస్‌ డేవిడ్‌సన్‌ కెన్నర్‌. ఆఫ్రికన్‌ అమెరికన్‌.

Published : 08 Mar 2022 00:48 IST

మనం వాడే మాయిశ్చర్‌ ప్రూఫ్‌, జరగకుండా, అంటించుకోగల శానిటరీ ప్యాడ్‌లు బీట్రిస్‌ కెన్నర్‌ చలవే అని చెప్పొచ్చు. తన పూర్తిపేరు.. మేరీ బీట్రిస్‌ డేవిడ్‌సన్‌ కెన్నర్‌. ఆఫ్రికన్‌ అమెరికన్‌.

బీట్రిస్‌ది ఆవిష్కర్తల కుటుంబంగా చెబుతారు. ఈమెనే కాదు.. నాన్న, అక్క కూడా బోలెడు ఆవిష్కరణలు చేశారు. 1912లో జన్మించిన బీట్రిస్‌ బాల్యం నుంచే  గ్యాడ్జెట్లు, గృహ సంబంధ సమస్యలకు పరిష్కారాలను కనిపెట్టేవారు. ఆరేళ్లకే తలుపులు వేసేప్పుడు చప్పుడవకుండా వాటంతటవే ఆయిల్‌ వేసుకునేలా రూపొందించారు. ఆ విధానాన్నే కార్ల విషయంలోనూ ప్రయోగించారు. ఈమెకు గుర్తింపు తెచ్చింది మాత్రం శానిటరీ బెల్ట్‌. దీన్ని 1920ల్లోనే కనిపెట్టింది. పెటెంట్‌ తీసుకోవడానికి డబ్బులేక వెలుగులోకి రావడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. 1931లో గ్రాడ్యుయేషన్‌ చేశాక ఈమెకి హోవర్డ్‌ యూనివర్సిటీలో ఉన్నత విద్య అవకాశమొచ్చింది. ఈమె రూపురేఖలు ఎక్కువగా ఆఫ్రికా వాళ్లని పోలి ఉండేవి. దీంతో లింగవివక్షను ఎదుర్కొంది. దీనికితోడు ఆర్థిక సమస్యలూ చుట్టుముట్టడంతో చదువుకి స్వస్తి చెప్పింది. వివిధ ఉద్యోగాలు చేసి, నిలదొక్కుకున్నాక 1957లో పేటెంట్‌ సాధించారు. అప్పట్లో నెలసరి అంటే వస్త్రాలతో చేసినవే మార్గం. అవేమో కదిలిపోయేవి, పైగా లీకేజీ సమస్యలు. వాటికి చెక్‌ పెడుతూ బీట్రిస్‌ శానిటరీ బెల్ట్‌ను రూపొందించారు. పేటెంట్‌ తర్వాత దాన్ని మరకలు పడకుండా మాయిశ్చర్‌ ప్రూఫ్‌గా ఉండేలా తీర్చిదిద్దారు. ఈ ఆవిష్కరణ నచ్చి ఓ సంస్థ మార్కెటింగ్‌ చేయడానికీ ముందుకొచ్చింది. కానీ నల్లజాతీయురాలని తెలిసి వెనకడుగు వేసింది. దీంతో తనే స్వయంగా మార్కెటింగ్‌ చేసింది. దీన్ని ఆధారంగా చేసుకునే తర్వాత్తర్వాత బెల్ట్‌లెస్‌ ప్యాడ్‌లు వచ్చాయి. ఎలాంటి స్థితి అయినా బీట్రిస్‌ తన ఆవిష్కరణలను ఆపలేదు. వీల్‌ చెయిర్‌ అటాచ్‌మెంట్‌, టాయ్‌లెట్‌ పేపర్‌ హోల్డర్‌, మసాజర్‌ సహా.. ఎన్నో ఆటల్నీ అక్కతో కలిసి రూపొందించింది. నల్లజాతీయురాలిగా అత్యధిక పేటెంట్‌లు (5) సాధించిన ఘనత ఇప్పటికీ ఈమె పేరిటే ఉంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్