మన కోసం తిరుపతిలో...పింక్‌ ఆటోలు!

ఎంత తప్పనిసరి ప్రయాణమైనా... రాత్రిపూట ఆటో ఎక్కాలంటే జంకుతాం. కారణం... ఆ ఆటోలు ఎంతవరకూ సురక్షితమో అన్న సందేహం. అందులోనూ కొత్త ప్రాంతాల్లో అయితే చెప్పే పనేముంది. ‘ఇక మీకా

Updated : 03 Apr 2022 06:16 IST

ఎంత తప్పనిసరి ప్రయాణమైనా... రాత్రిపూట ఆటో ఎక్కాలంటే జంకుతాం. కారణం... ఆ ఆటోలు ఎంతవరకూ సురక్షితమో అన్న సందేహం. అందులోనూ కొత్త ప్రాంతాల్లో అయితే చెప్పే పనేముంది. ‘ఇక మీకా భయం లేదు. ఏ సమయంలో అయినా మేమున్నాం’ అనే భరోసా ఇస్తున్నారు తిరుపతిలోని ఆటో మహిళామణులు...

ఈ సారి తిరుపతి వెళ్లినప్పుడు గులాబీరంగులో ఉండే ఆటోలని చూస్తే.. ఇవేంటి ప్రత్యేకంగా ఉన్నాయే అనుకోకండి. అవి మహిళలు నడిపే ఆటోలు. మహిళల ప్రయాణ సౌలభ్యం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వెంకన్న దర్శనానికే కాకుండా ఆసుపత్రుల్లో చికిత్సల కోసం, విద్యాలయాల్లో చదువుకునే పిల్లలు, వారి కుటుంబ సభ్యులు చాలా ప్రాంతాల నుంచి రోజూ వేల సంఖ్యలో తిరుపతికి వస్తుంటారు. వారిలో మగతోడు లేకుండా వచ్చే మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకునే ఈ పింక్‌ ఆటో సర్వీసులను ప్రారంభించారు. రాస్‌ స్వచ్ఛంద సంస్థ ఆర్థిక సహకారంతో 350 మంది మహిళలు ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ పొందారు. వారిలో 150 మంది మహిళలు తిరుపతిలో ఆటోలు నడుపుతూ ఉపాధి పొందుతున్నారు. ‘రాత్రి వేళ ఆటోలో ప్రయాణిస్తున్న మహిళలు పలు సందర్భాల్లో.... డ్రైవర్లతో ఇబ్బంది పడి పోలీస్‌ కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేసేవారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడ్డారు. కొందరికి ఇలా కాల్‌ చేసే అవకాశమూ ఉండకపోవచ్చు. అందుకే ప్రత్యేకంగా ఈ గులాబీ రంగు ఆటోలను అందుబాటులోకి తెచ్చాం. తర్వాత మగ డ్రైవర్లతో పాటు ఒకే స్టాండులో ఉండటం మహిళా ఢ్రైవర్లకు, ప్రయాణికులకూ అసౌకర్యంగా ఉండటాన్ని గమనించి ప్రత్యేక స్టాండులనూ ఏర్పాటు చేశాం’ అని వివరించారు తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు.

ఏ సమయంలో అయినా ఈ షీ ఆటోస్టాండుకి వెళ్తే చాలు. అక్కడి మహిళా డ్రైవర్లు సురక్షితంగా గమ్యానికి చేరుస్తారు. నగర బస్టాండ్‌, రుయా ఆసుపత్రి, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ప్రాంతాల్లో ఈ స్టాండులు ఉంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్