మాతృత్వం మాటల్లో చెప్పలేనిది..!

గర్భధారణ నుంచి ప్రసవం వరకు రోజుకో అనుభవం. ఆ బిడ్డని ఈ లోకంలోకి తీసుకొచ్చే రోజున మరుజన్మనే ఎత్తుతుంది అమ్మ. అయినా ఆమె మనసులో తెలియని ఆనందం. ‘నేనూ ఇలాంటి అనుభూతికి

Published : 22 Apr 2022 00:33 IST

గర్భధారణ నుంచి ప్రసవం వరకు రోజుకో అనుభవం. ఆ బిడ్డని ఈ లోకంలోకి తీసుకొచ్చే రోజున మరుజన్మనే ఎత్తుతుంది అమ్మ. అయినా ఆమె మనసులో తెలియని ఆనందం. ‘నేనూ ఇలాంటి అనుభూతికి లోనవుతున్నా’ అంటోంది కాజల్‌. ఇటీవలే తన బాబు (నీల్‌)కి జన్మనిచ్చింది. తన అనుభవాలను ఇన్‌స్టాలో ఇలా పంచుకుంది.. ‘నీల్‌ను ఈ ప్రపంచంలోకి తీసుకొస్తున్నానన్నప్పుడు తెలియని అనుభూతి. సుదీర్ఘ ప్రయాణమే కానీ చాలా తృప్తినిచ్చింది. అలా బయటికొచ్చాడో లేదో మ్యూకస్‌, ప్లాసెంటాలతో నిండిన తనని అలాగే నా గుండెల మీద ఉంచినప్పుడు ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను. లోతైన ప్రేమంటే ఏంటో నాకప్పుడే తెలిసింది. జీవితాంతం నిర్వహించాల్సిన బాధ్యతా అర్థమైంది. కానీ ఇదంతా సులువేమీ కాలేదు. మూడు నిద్రలేని రాత్రులు, రక్తంతో నిండిన ప్యాడ్‌లు, బ్రెస్ట్‌ పంప్‌.. వీటికితోడు సరిగానే ఉన్నాడో లేడోనన్న ఆందోళన. తెలియని అనిశ్చితి, ఒత్తిడి. తనొచ్చాక.. కొన్ని మధురమైన కౌగిలింతలు, నా బిడ్డ కళ్లలోకి ప్రేమగా చూసే చూపులు, చిన్ని ముద్దులు వంటి ఎన్నో సంతోష క్షణాలు. మా ఇద్దరి ఈ ప్రయాణంలో కలిసి ఎదుగుతూ, నేర్చుకుంటూ ఒకరినొకరం ఆవిష్కరించుకుంటున్నాం. నిజానికి ప్రసవానంతర సమయం ఆకర్షణీయం కాదు కానీ అందమైనదే’ అంటూ రాసుకొచ్చింది. చదివాక ప్రతి అమ్మకూ బిడ్డతో తన ప్రయాణం గుర్తొస్తుంది కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్