యాభైఏళ్లుగా... ఒకటే మాట!

జీవనాధారం.. కుటుంబ విలువలు. వీటిల్లో ఏది ముఖ్యమో తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు రెండోదానికే ఓటేశారు ఛత్తీస్‌గఢ్‌లోని పాల్వాడి గ్రామమహిళలు. 50 ఏళ్ల క్రితం వాళ్లు తీసుకున్న ఆ నిర్ణయం వాళ్ల గ్రామాన్ని ప్రత్యేకంగా నిలిపింది.. ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజన ప్రాంత ‌పజల్లో అధికమంది విప్పపూలతో సారాయి తయారుచేసి దానిని విక్రయిస్తుంటారు. అదే వాళ్ల జీవనోపాధి కూడా. కానీ ధర్మపురి జిల్లాలో ఉన్న పాల్వాడి గ్రామం మాత్రం ఇందుకు...

Published : 10 May 2022 01:31 IST

జీవనాధారం.. కుటుంబ విలువలు. వీటిల్లో ఏది ముఖ్యమో తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు రెండోదానికే ఓటేశారు ఛత్తీస్‌గఢ్‌లోని పాల్వాడి గ్రామమహిళలు. 50 ఏళ్ల క్రితం వాళ్లు తీసుకున్న ఆ నిర్ణయం వాళ్ల గ్రామాన్ని ప్రత్యేకంగా నిలిపింది..

త్తీస్‌గఢ్‌లోని గిరిజన ప్రాంత ‌పజల్లో అధికమంది విప్పపూలతో సారాయి తయారుచేసి దానిని విక్రయిస్తుంటారు. అదే వాళ్ల జీవనోపాధి కూడా. కానీ ధర్మపురి జిల్లాలో ఉన్న పాల్వాడి గ్రామం మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా మద్యాన్ని తమ ఇళ్లలోనే కాదు గ్రామ సరిహద్దుల్లోకి కూడా రాకుండా జాగ్రత్తపడుతోంది. యాభై ఏళ్లుగా ఈ విషయంలో ఏమాత్రం రాజీపడకుండా అక్కడి మహిళలు పోరాడుతున్నారంటే అదేం చిన్న విషయం కాదు. ఆ గ్రామంలో మద్యాన్ని తయారు చేసినా, విక్రయించినా, తాగినా జరిమానా చెల్లించాల్సిందే. ప్రభుత్వాలకే ఎంతో కష్టసాధ్యమైన పనిని ఈ గ్రామ మహిళలు అర్ధశతాబ్దంగా విజయవంతంగా అమలు చేయడానికి ఓ కారణం ఉంది.

పోరాటం సాగిందిలా..

మద్యం తాగి.. ఆ మత్తులో ఇంట్లో భార్యాపిల్లల్ని కొట్టడం, వేధించడం చేసేవారు ఆ గ్రామమగవాళ్లు. ఈ మద్యం వల్లే కదా తమ కుటుంబంలో కలతలు మొదలవుతున్నాయని గ్రహించిన మహిళలు ఆ సారాయినే ఊళ్లో లేకుండా చేయాలని అనుకున్నారు. ‘మద్యాన్ని నిషేధిద్దాం’ అనే నినాదాన్ని ఊపిరిలా భావించారు. బృందాలుగా ఏర్పడి ఇంటింటికీ తిరిగి మద్యం తీసుకుంటే జరిగే అనారోగ్య సమస్యలు, కుటుంబపరంగా ఏర్పడుతున్న కలతలు, పెరుగుతున్న నేరాలపై మహిళలందరికీ అవగాహన కలిగించడం మొదలుపెట్టారు. జాగేశ్వరి గౌతమ్‌ అధ్యక్షురాలిగా

..ఈ ఉద్యమం ఊపందుకుంది. మద్యం అమ్మకాలు ఆపాలంటే తయారీని ఆపాలి అని నిర్ణయించుకున్న జాగేశ్వరి బృందం ముందు తయారీని అడ్డుకుంది. ‘తయారీ, అమ్మకాలు లేక చాలామంది మగవాళ్లు మద్యానికి దూరమయ్యారు. ఆ మిగిలిన సొమ్ముతో పిల్లల్ని చదివించడం మొదలుపెట్టారు. ఎవరైనా కాదని ప్రయత్నిస్తే వాళ్లు మాకు రూ.20 వేలు జరిమానా కట్టాలి. అంత నగదు చెల్లించాలంటే కష్టం కాబట్టి ఎవరూ ధైర్యం చేయరు. ఒకవేళ ఏ పక్క గ్రామమో వెళ్లి తాగి వస్తే రూ.10వేలు జరిమానా చెల్లించాల్సిందే. యాభైఏళ్లుగా జరిమానాల విషయంలో ఎక్కడా రాజీపడలేదు. దాంతో నెమ్మదిగా మా గ్రామం అభివృద్ధి బాట పట్టింది. ఇది చూసిన పక్క గ్రామాల మహిళలు వచ్చి మమ్మల్ని సంప్రదించడం మొదలుపెట్టారు. మా సూచనల మేరకు వాళ్లూ కమిటీలుగా ఏర్పడి వాళ్ల గ్రామాల్లో మద్యాన్ని నిషేధించడానికి మాలాగే పోరాడి మరీ విజయం సాధిస్తున్నారు. సోన్హరి, ధనోరా, ముర్ముది, మడ్కేరా, భందర్‌వాడి గ్రామాల్లోనూ ఈ పద్ధతిలో మద్యాన్ని నిషేధించగలిగారు’ అంటోంది జాగేశ్వరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్