ఆదివాసీ ఉత్పత్తులు ఆన్‌లైన్లో!

ఆమె పుట్టి పెరిగింది నగరాల్లో. ఉద్యోగం చేసింది దేశ రాజధాని దిల్లీలో. కానీ పల్లె జీవనమంటే ఆమెకెంతో ఇష్టం. దాంతో దిల్లీ వదిలి ఒడిశాలోని ఆదివాసీ గ్రామానికి మకాం మార్చింది 35 ఏళ్ల కావ్యా సక్సేనా. అక్కడి ఉత్పత్తుల్ని ప్రపంచానికి అందిస్తూ స్థానికుల జీవితాల్లో మార్పు తెస్తోంది!...

Published : 11 May 2022 01:26 IST

ఆమె పుట్టి పెరిగింది నగరాల్లో. ఉద్యోగం చేసింది దేశ రాజధాని దిల్లీలో. కానీ పల్లె జీవనమంటే ఆమెకెంతో ఇష్టం. దాంతో దిల్లీ వదిలి ఒడిశాలోని ఆదివాసీ గ్రామానికి మకాం మార్చింది 35 ఏళ్ల కావ్యా సక్సేనా. అక్కడి ఉత్పత్తుల్ని ప్రపంచానికి అందిస్తూ స్థానికుల జీవితాల్లో మార్పు తెస్తోంది!

మానవ వనరుల విభాగంలో ఎంబీఏ చేసిన కావ్యాది రాజస్థాన్‌లోని జైపుర్‌. ఇండియన్‌ ఆయిల్‌లో ఏడేళ్లూ, తర్వాత ఆతిథ్య రంగంలో మూడేళ్లూ విధులు నిర్వహించింది. ఎప్పుడు సెలవు దొరికినా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేది. కానీ కొవిడ్‌ మొదటి లాక్‌డౌన్‌ సమయంలో గుడ్‌గావ్‌లోని తన ఫ్లాట్‌కు పరిమితమెంiది. ప్రయాణాలమీద ఆంక్షల తీసేయగానే ఉద్యోగానికి సెలవు పెట్టి దేశవ్యాప్త పర్యటనకు బయలుదేరింది. గ్రామీణ భారతం ప్రత్యేకతలు ప్రపంచానికి చెప్పాలనేది ఆ పర్యటన ఉద్దేశం. దీనికి మహీంద్రా అండ్‌ మహీంద్రా ఆర్థిక సాయం చేసింది. కారులో తిరుగుతూ పర్యటన విశేషాల్ని సోషల్‌ మీడియాలో పంచుకునేది. తన మనసు గ్రామాల్లో ఉన్నపుడు తాను మాత్రం నగరాల్లో ఎందుకు అనిపించింది కావ్యాకి. దాంతో ఆదివాసీలు ఎక్కువగా ఉండే ఒడిశాలోని కొరాపుట్‌ ప్రాంతానికి 2021 జులైలో వెళ్లి అక్కడో గ్రామంలో ఉంటోంది. ఆమె ఉండే ప్రాంతంలో నాణ్యమైన పసుపు దొరుకుతుంది. వాటితో సబ్బులు తయారుచేసి అమ్మిస్తోంది. దీంతో ఒక గ్రామం మొత్తం ఉపాధి పొందుతున్నారు. మరో గ్రామాన్ని దత్తత తీసుకుంది. అక్కడ ప్రత్యేకమైన గడ్డిని పెంచుతున్న 55 మంది మహిళలకు చేయూతనిస్తోంది. ఇవి మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉండే ఆదివాసీలు వెదురు, ఆకులు, గడ్డితో చేసే బుట్టలూ, సంచులూ, టోపీలూ, నవ్వారు, సంప్రదాయ దుస్తులు, వారి ఆభరణాలు... మొదలైన ఉత్పత్తుల్ని ‘క్రాఫ్ట్‌పోట్లీ’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా మార్కెట్‌ చేస్తోంది. కొన్ని మేనేజ్‌మెంట్‌ కాలేజీల్లో గ్రామీణ వాణిజ్యంపైన పాఠాలూ చెబుతుంది. అరుణాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌ ప్రభుత్వాలతో కలిసి చేతివృత్తులవారి ఉత్పత్తుల్ని మార్కెటింగ్‌ కోసం కృషిచేస్తోంది. మహిళలు తమ వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి ఇది అత్యంత అనుకూల సమయమని చెబుతుంది కావ్య.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్