సామాన్యురాలు కాదు.. కలెక్టర్‌!

ఈ చిత్రంలో ఇద్దరూ వరద బాధితుల్లానే కనిపిస్తున్నారు కదూ! అక్కడున్నవారూ అలానే భావించారు. ఆ తర్వాత వాళ్లలో ఒకరు జిల్లా డిప్యూటీ కమిషనర్‌ (కలెక్టర్‌ని అసోంలో అలా పిలుస్తారు) అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు.

Published : 27 May 2022 00:40 IST

ఈ చిత్రంలో ఇద్దరూ వరద బాధితుల్లానే కనిపిస్తున్నారు కదూ! అక్కడున్నవారూ అలానే భావించారు. ఆ తర్వాత వాళ్లలో ఒకరు జిల్లా డిప్యూటీ కమిషనర్‌ (కలెక్టర్‌ని అసోంలో అలా పిలుస్తారు) అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఎడమవైపున ఉన్నావిడ అధికారి. మన తెలుగమ్మాయే! పేరు.. కీర్తి జల్లి. అసోం వరదల్లో తీవ్రంగా దెబ్బతిన్న కచార్‌ జిల్లాలో ఆమె అందిస్తున్న సేవలకు ప్రశంసలు వెల్లువెతున్నాయి. సాదా చీరకట్టుతో హంగూ ఆర్భాటాలేమీ లేకుండా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారు. అధికారులతో కలిసిపోయి తానూ పనులు చేస్తున్నారు. జిల్లాలోని బొర్ఖొల డెవలప్‌మెంట్‌ బ్లాక్‌లోని ఓ గ్రామంలో పర్యటించిన దృశ్యమిది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం 15 జిల్లాల్లోని 1073 గ్రామాలను వరదలు ముంచెత్తితే వాటిలో కచార్‌ జిల్లాలోనే అత్యధికంగా 291 ఉన్నాయి. అలాంటి స్థితిలో ఆవిడే వీలైనంతమంది బాధితులను పరామర్శించి, సాయం అందివ్వడం, సహాయ శిబిరాల్లో సేవలను సమీక్షించడం చేస్తున్నారు. అభినందించాల్సిన విషయమేగా మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్