టీచరమ్మకి అందాల కిరీటం

పెళ్లైయినంత మాత్రాన ఆశలకీ... లక్ష్యాలకీ దూరంగా ఉండాలని ఎవరన్నారు? అటు అందాల పోటీల్లోనూ.. ఇటు సేవామార్గంలోనూ చురుగ్గా ఉంటూ మిసెస్‌ ఇండియా వరల్డ్‌ కిరీటాన్ని దక్కించుకుందీ టీచరమ్మ...సర్గమ్‌ది గుజరాత్‌. ముంబయిలో స్థిరపడ్డారు. భర్త ఆది కౌశల్‌ భారత నౌకాదళ అధికారి. ఆయన వృత్తిరీత్యా విశాఖపట్నంలోనూ ఉన్నారు. ఇంగ్లిష్‌ లిటరేచర్‌లో పీజీ పూర్తి చేసిన ఈమె టీచర్‌గానూ పని..

Updated : 18 Jun 2022 05:09 IST

పెళ్లైయినంత మాత్రాన ఆశలకీ... లక్ష్యాలకీ దూరంగా ఉండాలని ఎవరన్నారు? అటు అందాల పోటీల్లోనూ.. ఇటు సేవామార్గంలోనూ చురుగ్గా ఉంటూ మిసెస్‌ ఇండియా వరల్డ్‌ కిరీటాన్ని దక్కించుకుందీ టీచరమ్మ...

ర్గమ్‌ది గుజరాత్‌. ముంబయిలో స్థిరపడ్డారు. భర్త ఆది కౌశల్‌ భారత నౌకాదళ అధికారి. ఆయన వృత్తిరీత్యా విశాఖపట్నంలోనూ ఉన్నారు. ఇంగ్లిష్‌ లిటరేచర్‌లో పీజీ పూర్తి చేసిన ఈమె టీచర్‌గానూ పని చేసింది. క్యాన్సర్‌ బాధిత పిల్లల కోసం సేవా సంస్థలతో కలిసి పనిచేస్తోంది. తనకు అందాల పోటీలపై ఆసక్తి ఎక్కువ. పెళ్లయ్యాక ప్రయత్నించే స్వేచ్ఛ కలిగింది. దీంతో ఈ ఏడాది మిసెస్‌ ఇండియా వరల్డ్‌ పోటీలకు ప్రయత్నించింది. దేశవ్యాప్తంగా వేల దరఖాస్తులు... పలు దశల వడపోతల తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి 52 మందిని ఎంపిక చేశారు. వారందరినీ వెనక్కి నెట్టింది సర్గమ్‌. ఈసారి పోటీలకు సోహా అలీఖాన్‌, వివేక్‌ ఒబెరాయ్‌, మహమ్మద్‌ అజారుద్దీన్‌, డిజైనర్‌ మాసుమీ మేవావాలా, మాజీ మిసెస్‌ వరల్డ్‌ అదితీ గోవిత్రికర్‌ల ప్యానెల్‌ని మెప్పించి విజేతగా నిలిచింది. ‘ఎన్నో ఏళ్ల కల ఇది. కిరీటాన్ని దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రపంచ వేదికపై పోటీపడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’ అంటోంది. ఈ గెలుపుతో వచ్చే ఏడాది అమెరికాలో జరగనున్న మిసెస్‌ వరల్డ్‌ పోటీలకు అర్హత సాధించింది. దీనిలో 80 దేశాల వాళ్లు పాల్గొంటారు. 1984 నుంచి పోటీలు జరుగుతున్నా మన దేశం నుంచి డాక్టర్‌ అదితీ గోవిత్రికర్‌ (2001) మినహా ఎవరూ మిసెస్‌ వరల్డ్‌ కిరీటాన్ని గెల్చుకోలేకపోయారు. ఈసారి ‘నేను సాధిస్తా’నంటోంది సర్గమ్‌. ఆల్‌ ది బెస్ట్‌ చెబుదామా మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్