పాత వంటగిన్నెలు చూస్తారా?

గాబు, గంగాళం, చట్టి వీటి పేర్లు ఎప్పుడైనా విన్నారా? అమ్మమ్మ కాలంలో వాడిన పాత్రలివి. వీటి గురించిన ప్రస్తావన ఇప్పుడెందుకంటారా? ఏళ్లనాటి ఆ పాత్రలను నేటి తరానికి పరిచయం చేయాలనుకున్నారు చంద్రాజైన్‌.

Updated : 13 Apr 2023 02:59 IST

గాబు, గంగాళం, చట్టి వీటి పేర్లు ఎప్పుడైనా విన్నారా? అమ్మమ్మ కాలంలో వాడిన పాత్రలివి. వీటి గురించిన ప్రస్తావన ఇప్పుడెందుకంటారా? ఏళ్లనాటి ఆ పాత్రలను నేటి తరానికి పరిచయం చేయాలనుకున్నారు చంద్రాజైన్‌. అందుకే వీటన్నింటినీ సేకరించి ప్రదర్శిస్తున్నారు..

ఎగ్జిబిషన్‌ అంటే సాధారణంగా మనకి ఆభరణాలు, దుస్తులు ఇవే గుర్తుకొస్తాయి కదా! అయితే ఈ ప్రదర్శనలో మాత్రం వందలేళ్లనాటి రాగి చెంబులు, ఇత్తడి కళాయిలు, పాతకాలం అన్నం క్యారేజీలు, నూనె గిన్నెలు, ఇత్తడి వంటపాత్రలు. పోపుల పెట్టెలు, టీ వడకట్టే వెదురు జాలీలు, కొబ్బరి కోరేవి కనిపిస్తాయి. కర్ణాటక క్రాఫ్ట్స్‌ కౌన్సిల్‌ సభ్యురాలు చంద్రాజైన్‌ వీటిని సేకరించి ప్రదర్శనకు ఉంచారు. ‘మాది లఖ్‌నవూ. చిన్నప్పుడు మా ఇంట్లో అన్నీ ఇత్తడి, కంచుపాత్రలే. తినే ఆహారాన్ని కలుషితం చేయకుండా ఉంచుతాయని అమ్మ చెప్పేది. అందుకే వీటి గురించి ఇప్పటితరానికి చెప్పాలనిపించింది. కర్ణాటక, అసోం, కశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ్‌బంగా, ఒడిశా, కేరళ రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ పాత్రలను సేకరించాం. ఇందుకు ఏడాది సమయం పట్టింది. వీటిని ‘పాత్రే’ పేరుతో ప్రదర్శిస్తున్నా. రసాయనాలు విడుదల చేసే కోటింగ్‌ పాత్రలకు ప్రాధాన్యమివ్వకుండా ఇటువంటివాటి పట్ల అవగాహన పెంచుకొని అందరూ ఆరోగ్యాన్ని పొందాలనేదే నా లక్ష్యమ’ని చెబుతున్నారు చంద్ర.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్