Goal In Saree: చీరతో గోల్‌

అదో కాలేజీ గ్రౌండ్‌.. రంగురంగుల చీరల్లో ఆడవాళ్లంతా అక్కడికి చేరుకున్నారు. ఏ ఫంక్షన్‌కో అనుకుంటున్నారేమో.. ఫుట్‌బాల్‌ ఆడటానికి! మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్థానిక ఎన్‌జీవోతో కలిసి ‘గోల్‌ ఇన్‌ శారీ’ పేరుతో ఫుట్‌బాల్‌ పోటీలు నిర్వహించింది.

Published : 29 Mar 2023 00:04 IST

అదో కాలేజీ గ్రౌండ్‌.. రంగురంగుల చీరల్లో ఆడవాళ్లంతా అక్కడికి చేరుకున్నారు. ఏ ఫంక్షన్‌కో అనుకుంటున్నారేమో.. ఫుట్‌బాల్‌ ఆడటానికి! మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్థానిక ఎన్‌జీవోతో కలిసి ‘గోల్‌ ఇన్‌ శారీ’ పేరుతో ఫుట్‌బాల్‌ పోటీలు నిర్వహించింది. 8 బృందాలు పోటాపోటీగా ఆడాయి. వాళ్లంతా ఆటలు పరిచయం లేని చిరు వ్యాపారస్థులు, గృహిణులు, ఉద్యోగినులు. అందరూ పెళ్లైనవారే! ‘ఆడవాళ్లు ఎక్కువగా ఇంటికే పరిమితం అవుతుంటారు. తమ ఆరోగ్యాన్నీ పట్టించుకోరు. వాళ్లకీ వ్యాయామం అవసరమంటే.. చీరలో ఇబ్బంది అంటారు. ఆ భావనను పోగొట్టాలనే ఈ పోటీలు నిర్వహించా’ మంటున్నారు నిర్వాహకులు. 20-72 ఏళ్ల వాళ్లు దాదాపు 100 మంది దీనిలో పాల్గొన్నారు. వయసుతో సంబంధం లేకుండా క్రీడాకారులను తలపించేలా ఆడిన వాళ్లను చూసి నెటిజన్లు.. లింగ సమానత్వానికీ, క్రీడల్లో మహిళల సామర్థ్యానికి ఇది చిహ్నమంటూ పొగుడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్