ప్రెగ్నెన్సీ డయాబెటిస్.. చంకలో గడ్డలు.. ఎలా తగ్గించుకోవాలి?

నమస్తే డాక్టర్‌. నా వయసు 29. నాకు 18 నెలల బాబున్నాడు. నాకు ప్రెగ్నెన్సీ డయాబెటిస్‌ ఉంది. దాన్నెలా తగ్గించుకోవాలి? అలాగే నాకు తరచుగా చంకలో గడ్డలు వస్తుంటాయి. వేసవి కాలం ఈ సమస్య మరింతగా ఉంటుంది. ఈ రెండు సమస్యలకు తగిన పరిష్కారం చెప్పండి. - ఓ సోదరి

Published : 24 Feb 2022 20:46 IST

నమస్తే డాక్టర్‌. నా వయసు 29. నాకు 18 నెలల బాబున్నాడు. నాకు ప్రెగ్నెన్సీ డయాబెటిస్‌ ఉంది. దాన్నెలా తగ్గించుకోవాలి? అలాగే నాకు తరచుగా చంకలో గడ్డలు వస్తుంటాయి. వేసవి కాలం ఈ సమస్య మరింతగా ఉంటుంది. ఈ రెండు సమస్యలకు తగిన పరిష్కారం చెప్పండి. - ఓ సోదరి

జ: మీకు ప్రెగ్నెన్సీ డయాబెటిస్‌ ఉందంటే ప్రెగ్నెన్సీలో వచ్చిన డయాబెటిస్‌ ఇంకా కొనసాగుతోందా? లేదంటే తగ్గిపోయిందా? అన్న విషయంలో స్పష్టత లేదు. ఒకవేళ మొదటి ప్రెగ్నెన్సీలో డయాబెటిస్‌ వచ్చి కాన్పు తర్వాత తగ్గిపోయి ఉంటే మీరు సరైన జీవనశైలిని పాటించడం, ఆహార-వ్యాయామ నియమాలు పాటించడం.. తప్పనిసరిగా చేయాలి. తర్వాత ప్రెగ్నెన్సీలో కూడా ఈ డయాబెటిస్‌ రావడానికి అవకాశాలు ఉంటాయి. అందుకని ప్రెగ్నెన్సీకి ప్లాన్‌ చేసుకునే ముందు ఓసారి డాక్టర్‌ని సంప్రదించడం మంచిది. ఒకవేళ ప్రెగ్నెన్సీలో వచ్చి ఇప్పటికీ డయాబెటిస్‌ కొనసాగుతున్నట్లయితే మీరు ఫిజీషియన్‌ సలహాతో దానికి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

ఇక వేసవిలో చంకలో గడ్డలు రావడం అనేది హెయిర్‌ ఫాలికల్‌ ఇన్ఫెక్షన్‌ వల్ల వస్తుంది. ఒకసారి చర్మ వ్యాధి నిపుణులను సంప్రదించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్