Published : 01/01/2022 19:30 IST

నా ముఖంపై నల్ల మచ్చలు తగ్గేదెలా?

హాయ్‌ మేడం. నా ముఖంపై నల్ల మచ్చలున్నాయి. అవి పోవాలంటే ఏం చేయాలి? - ఓ సోదరి

జ: మీ ముఖంపై సాధారణ నల్ల మచ్చలున్నాయా? లేదంటే పిగ్మెంటేషన్‌ సమస్యా అనేది మీరు స్పష్టంగా రాయలేదు. అలాగే మీ వయసెంతో కూడా చెప్పలేదు. సాధారణంగా 40-50 ఏళ్లు దాటిన మహిళల్లో నల్ల మచ్చలంటే పిగ్మెంటేషన్‌ అనుకోవచ్చు. కానీ మీరు మీ వయసు, సమస్య గురించి స్పష్టంగా చెప్పలేదు.. కాబట్టి మీ ముఖంపై ఉన్న నల్ల మచ్చల్ని తగ్గించుకోవాలంటే యాపిల్‌తో తయారుచేసిన ఈ ప్యాక్‌ను ఉపయోగించచ్చు.

ముందుగా ఒక యాపిల్‌ తీసుకొని.. దాని తొక్క చెక్కేసి, గుజ్జును మెత్తటి పేస్ట్‌లా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో టేబుల్‌స్పూన్‌ చొప్పున బార్లీ పౌడర్‌, తేనె వేసుకొని.. ఈ మూడింటినీ బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా అప్లై చేసుకోవాలి. 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచుకొని ఆపై చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇదే ప్యాక్‌ను క్రమం తప్పకుండా నెల రోజుల పాటు రోజూ వేసుకున్నట్లయితే నల్ల మచ్చలు తగ్గి ముఖమంతా ఒకే రంగులోకి వస్తుంది.. కాంతివంతంగానూ మారుతుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని