కళ్లు పెద్దవిగా కనిపించేలా..!

అమ్మాయిల అందంలో ముఖ్యపాత్ర పోషించే వాటిలో కళ్లు కూడా ఒకటి. అయితే కొందరు పెద్ద పెద్ద కళ్లతో కళకళలాడుతూ ఉంటే మరికొందరు మాత్రం చిన్న చిన్న కళ్లతో చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం పెద్ద కళ్లు ఉంటే బాగుంటుందనుకుంటారు. ఈ క్రమంలో మేకప్ వేసుకొనేటప్పుడు కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా

Published : 09 Feb 2022 19:52 IST

అమ్మాయిల అందంలో ముఖ్యపాత్ర పోషించే వాటిలో కళ్లు కూడా ఒకటి. అయితే కొందరు పెద్ద పెద్ద కళ్లతో కళకళలాడుతూ ఉంటే మరికొందరు మాత్రం చిన్న చిన్న కళ్లతో చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం పెద్ద కళ్లు ఉంటే బాగుంటుందనుకుంటారు. ఈ క్రమంలో మేకప్ వేసుకొనేటప్పుడు కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా చిన్న కళ్లను సైతం పెద్దవిగా కనిపించేలా చేసుకోవచ్చు. మరి, ఆ చిట్కాలేంటో మనం కూడా ఓసారి చూసేద్దాం రండి..

ఐ లైనర్‌తో..

సాధారణంగా ఐ లైనర్‌ని కనురెప్ప పైభాగంలోనే ఎక్కువగా ఉపయోగిస్తారు. కొంతమంది మాత్రం లైనర్‌తో కంటి చుట్టూ లైనప్ చేసుకోవడానికి కూడా ఇష్టపడతారు. కళ్లు చిన్నవిగా ఉన్నవారు కూడా ఐ లైనర్‌ని ఉపయోగిస్తే కళ్లు కాస్త పెద్దవిగా కనిపించేలా జాగ్రత్తపడచ్చు. ఈ క్రమంలో కంటి చుట్టూ లైనర్‌ని అప్త్లె చేసుకొని కంటి చివర్లలో మాత్రం కాస్త వంపు తిరిగినట్లుగా పెట్టుకోవాలి. దీని వల్ల ముఖానికి చక్కని లుక్ కూడా వస్తుంది.

కాస్త ఫ్యాషనబుల్‌గా కనిపించాలనుకొనేవారు ఐ లైనర్ అప్త్లె చేసుకున్న తర్వాత కాస్త ప్రకాశవంతమైన మరో షేడ్‌తో కూడా లైనప్ చేసుకోవచ్చు.

మస్కారాతో..

కళ్లు చిన్నవిగా ఉన్నప్పుడు కనురెప్పలకు మస్కారాతో ఒకటికి రెండుసార్లు టచప్ ఇస్తే కాస్త పెద్దవిగా కనిపించే అవకాశం ఉంటుంది. అవసరమైతే ఐ లాషెస్ కర్లర్‌ని ఉపయోగించి కనురెప్పల్ని కాస్త వంపు తిరిగినట్టు కనిపించేలా చేసుకోవాలి.

ఐ షాడోతో..

చిన్న కళ్లు ఉన్నవారు ఐ మేకప్ చేసుకొనే క్రమంలో లైట్ కలర్ ఐ షాడోలను ఉపయోగించాలి. డార్క్ కలర్స్‌కు వీలైనంత దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి కళ్లను మరింత చిన్నవిగా చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివారు న్యాచురల్ పింక్, పీచ్.. వంటి లేత రంగుల ఐ షాడోలను అప్త్లె చేసుకోవాలి.

ఒకవేళ డార్క్ కలర్స్‌ని ఉపయోగించాలనుకొంటే కంటి మూలల్లో లేదా చివర్లలో చాలా తక్కువ మొత్తంలో అప్త్లె చేసుకోవచ్చు.

కన్సీలర్‌తో..

కళ్ల కింద నల్లటి వలయాలు ఉంటే పెద్ద కళ్లు సైతం చిన్నవిగా కనిపిస్తాయి. మరి, చిన్న కళ్లు ఉన్నవారికి కూడా ఈ సమస్య ఉంటే?? కళ్లు మరింత చిన్నవిగా కనిపించవచ్చు. అందుకే నల్లటి వలయాలు చర్మం రంగులో కలిసిపోయేలా కన్సీలర్‌తో కవర్ చేయాలి.

రెండు వైపులా..

చిన్న కళ్లు ఉన్నవారు ఐ మేకప్ చేసుకొనేటప్పుడు కేవలం కంటి పైభాగం మీదే కాకుండా కింది భాగం మీద కూడా దృష్టి సారించాలి. అప్పుడే అవి పెద్దవిగా కనిపిస్తాయి. ఈ క్రమంలో ఐ షాడో, మస్కారా, ఐ లైనర్.. ఇలా దాదాపు అన్నీ రెండు భాగాల్లోనూ సమానంగా అప్త్లె చేసుకోవాలి.

మీకు ఐ షాడో అప్త్లె చేసుకోవడంలో బాగా నైపుణ్యం ఉంటే రెండు లేదా మూడు రంగులు కలిపి చాలా జాగ్రత్తగా అప్త్లె చేసుకోవచ్చు. అయితే మేకప్‌లో భాగంగా ఎలాంటి ప్రయత్నం చేసినా అది ముఖానికి బాగా నప్పాలని గుర్తుంచుకోవాలి.

ఈ జాగ్రత్తలు కూడా..

* కళ్ల కింద ఉపయోగించే ప్రత్యేక కన్సీలర్ ఉపయోగిస్తే మరిన్ని సత్ఫలితాలు పొందచ్చు.

* కనురెప్పలు వీలైనంత ఒత్తుగా కనిపించేలా మస్కారా అప్త్లె చేసుకోవాలి.

* స్మోకీ ఐ మేకప్ వంటివి ప్రయత్నించడం లేదా ఐ లైనర్‌ని కాస్త చెదిరినట్లుగా (డార్క్ నుంచి లైట్ కలర్ కనిపించేలా) పెట్టుకోవడం వల్ల కూడా కళ్లు పెద్దవిగా కనిపిస్తాయి.

* ఐ బ్రోస్‌ను కూడా ఎంత చక్కగా తీర్చిదిద్దుకుంటే కళ్లు అంత అందంగా, పెద్దవిగా కనిపిస్తాయి.

చూశారుగా.. చిన్న చిన్న మేకప్ చిట్కాలతో కళ్లు పెద్దవిగా కనిపించేలా ఎలా చేసుకోవచ్చో! వీటిని మీరు కూడా ఈసారి గుర్తుంచుకొని అనుసరించడానికి ప్రయత్నించండి. కళకళలాడే ముఖాకృతితో మరింత అందంగా మెరిసిపోండి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్