Updated : 23/10/2021 16:35 IST

కిలిమంజారో ఎక్కేసింది!

(Photo: Instagram)

జీవితమంటే రొటీన్‌గా కాకుండా.. అందులో కొన్ని పేజీలు తమకంటూ ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు కొంతమంది. తానూ అందుకు మినహాయింపు కాదంటోంది టాలీవుడ్‌ బ్యూటీ నివేదా థామస్‌. అందుకే ఓవైపు సినిమాల్లో బిజీగా ఉన్నా.. ఖాళీ సమయం దొరికితే చాలు.. సాహసాలకు ‘సై’ అంటానంటోంది. తాజాగా అలాంటి అడ్వెంచరే చేసిందీ ముద్దుగుమ్మ.

పర్వతారోహణను ఇష్టపడే ఈ చెన్నై చిన్నది.. తాజాగా ఆఫ్రికా టాంజానియాలోని మౌంట్‌ కిలిమంజారోను అధిరోహించింది. మువ్వన్నెల పతాకంతో ఆ పర్వత శిఖరంపై దిగిన ఓ అందమైన ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ.. ‘మొత్తానికి అనుకున్నది సాధించేశా!’ అనే క్యాప్షన్‌ పెట్టిందీ అందాల భామ. ఇలా తన విక్టరీని అభిమానులతో పంచుకుంటూనే.. మౌంటెనీరింగ్‌పై తనకున్న ఆసక్తిని బయటపెట్టిందీ టాలీవుడ్‌ బేబ్.

రెండు నెలల పాపాయితో..!

బాలింతలు అడుగు తీసి అడుగు వేయడానికే ఆపసోపాలు పడుతుంటారు. కానీ కొత్తగా తల్లయ్యాక ఎంత యాక్టివ్‌గా ఉంటే.. అంత త్వరగా కోలుకోవచ్చని నిరూపించింది బాలీవుడ్‌ బ్యూటీ సమీరా రెడ్డి. 2019లో రెండోసారి నైరా అనే పాపకు జన్మనిచ్చిన సమీర.. బిడ్డ పుట్టిన రెండు నెలలకే తన పాపాయిని తీసుకొని పర్వతారోహణకు బయల్దేరింది. ఈ క్రమంలో కర్ణాటకలోని ఎత్తైన శిఖరం Mullayanagiriని అధిరోహించే ప్రయత్నం చేసిందామె. అక్కడ దిగిన ఫొటోలు, తీయించుకున్న వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ అందరిలో స్ఫూర్తి నింపిందీ అందాల అమ్మ.

‘నైరాతో కలిసి Mullayanagiri పర్వతారోహణకు బయల్దేరా. అయితే వాతావరణ పరిస్థితులు, ఆక్సిజన్‌ కొరత కారణంగా ఈ సాహసయాత్రను మధ్యలోనే ముగించాల్సి వచ్చింది. సాధారణంగా కొత్తగా తల్లైన మహిళలు ఒత్తిడి, అలసటతో సతమతమవుతుంటారు. కానీ నేను వాటికి అవకాశం ఇవ్వదలచుకోలేదు. ఇక నేను నా బిడ్డకు ఎక్కడంటే అక్కడ నిర్మొహమాటంగా పాలివ్వగలను. అందుకే ఎక్కడికైనా సునాయాసంగా వెళ్లగలను..’ అని అప్పట్లో చెప్పుకొచ్చిందీ బాలీవుడ్‌ మామ్‌. ఇలా తన సాహసయాత్రతో కొత్తగా తల్లైన మహిళల్లో స్ఫూర్తి నింపుతూనే.. బహిరంగ ప్రదేశాల్లో తల్లిపాల ప్రాముఖ్యాన్నీ చాటింది సమీర.

వీళ్లే కాదు.. అందాల తారలు నివేతా పేతురాజ్‌ (కార్‌ రేసింగ్‌), ఊర్వశీ రౌతెలా (డైవింగ్‌), గుల్‌ పనగ్‌ (పైలట్), ప్రగ్యా జైస్వాల్‌ (రివర్‌ రాఫ్టింగ్).. తదితరులు కూడా ఆయా సాహస క్రీడల్లో తమ నైపుణ్యాలను ప్రదర్శించినవారే!

ఇదీ చదవండి:

అందాల తారలు.. సాహసాల్లో సర్టిఫై అయ్యారు!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని