వ్యాపారంలో రాణించాలంటే..

వ్యాపారం చేసి విజయం సాధించడానికి డబ్బు ఒకటే ఉంటే సరిపోదు. అదనంగా పెంచుకోవాల్సిన నైపుణ్యాలు కూడా కొన్ని ఉంటాయి తెలుసా. ఇంతకీ అవేంటంటే...

Updated : 22 Nov 2022 14:22 IST

వ్యాపారం చేసి విజయం సాధించడానికి డబ్బు ఒకటే ఉంటే సరిపోదు. అదనంగా పెంచుకోవాల్సిన నైపుణ్యాలు కూడా కొన్ని ఉంటాయి తెలుసా. ఇంతకీ అవేంటంటే...
* ముందు మీ గురించి మీరు తెలుసుకోవాలి. బలాలూ, బలహీనతల్ని అంచనా వేసుకోవాలి. బలాల్ని పెంచుకుంటూ, బలహీనతల్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. దానివల్ల మీపై మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే ఎప్పటికప్పుడు కొత్త విషయాలు కూడా నేర్చుకోగలగాలి. మీరు చేయాలనుకుంటోన్న లేదా చేసే వ్యాపారానికి సంబంధించిన సదస్సులకూ హాజరు కావడం వల్ల మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోగలరు.
* చాలామంది వ్యాపారులు... మాకు ఎవరూ సాయం చేయలేదు. ప్రతి పనీ మేమే నేర్చుకున్నాం అని చెబుతుంటారు. నిజమే. కొన్ని సాధించాలంటే కష్టపడాల్సిందే. ప్రతిదీ ఎవరో ఒకరు వచ్చి చేస్తారని కాకుండా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. సవాళ్లను ధైర్యంగా స్వీకరించగలగాలి.
* కేవలం ఉద్యోగులకే కాదు వ్యాపారం చేయాలనుకున్నవారూ నెట్‌వర్క్‌ని విస్తరించుకోగలగాలి. ఓ మెంటార్‌ని పెట్టుకుని సలహాలు తీసుకోవడం, వ్యాపారం గురించి పది మందికి తెలియజేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం... లాంటివన్నీ అవసరమే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్