‘కీర దోస ఫ్రైస్’.. కరకరలాడించేద్దాం!

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఏదైనా వేడివేడిగా, కారంకారంగా ఉండే స్నాక్స్ తినాలనిపించడం సహజం. అలాగని ఎంతసేపూ పకోడి, బజ్జీ, చిప్స్‌లాంటివేనా? కాస్త వెరైటీగా ట్రై చేయచ్చుగా..! ఆ కోవలోకే వస్తాయి ఈ 'కీర దోస ఫ్రైస్' కూడా! క్రిస్పీగా ఉండే వీటిని చూడగానే ఇట్టే లాగించేయాలనిపిస్తుంది. అంతేకాదు.. వీటితో బోలెడంత ఆరోగ్యం కూడా సొంతం చేసుకోవచ్చు.

Published : 25 Nov 2021 20:09 IST

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఏదైనా వేడివేడిగా, కారంకారంగా ఉండే స్నాక్స్ తినాలనిపించడం సహజం. అలాగని ఎంతసేపూ పకోడి, బజ్జీ, చిప్స్‌లాంటివేనా? కాస్త వెరైటీగా ట్రై చేయచ్చుగా..! ఆ కోవలోకే వస్తాయి ఈ 'కీర దోస ఫ్రైస్' కూడా! క్రిస్పీగా ఉండే వీటిని చూడగానే ఇట్టే లాగించేయాలనిపిస్తుంది. అంతేకాదు.. వీటితో బోలెడంత ఆరోగ్యం కూడా సొంతం చేసుకోవచ్చు. మరి, ఈ ఫ్రైస్ ఎలా తయారుచేయాలో తెలుసుకొని ఈవెనింగ్ స్నాక్స్‌గా మీ పిల్లలకు అందించేయండి!

కావాల్సినవి

* కీర దోసకాయ - 1

* వెల్లుల్లి పొడి - అర టీస్పూన్

* కారం - అర టీస్పూన్

* ఉప్పు - కొద్దిగా

* మిరియాల పొడి - రుచికి సరిపడా

* కొత్తిమీర తరుగు - కొద్దిగా

* ఆలివ్ నూనె - అర టీస్పూన్

* శెనగపిండి - 1 కప్పు

* పాలు - అర కప్పు

* బ్రెడ్ క్రంబ్స్ - 1 కప్పు

తయారీ

మొదట కీర దోసకాయను ఫ్రెంచ్ ఫ్రైస్‌లా నిలువుగా కట్ చేయాలి. వాటిని ఒక బౌల్‌లోకి తీసుకుని.. అందులో వెల్లుల్లి పొడి, కారం, ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర తరుగు, ఆలివ్ నూనెలను కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్‌లో శెనగపిండికి ఉప్పు, మిరియాల పొడి, పాలు కలిపి దోసె బ్యాటర్‌లా తయారుచేసుకోవాలి. ఆపై ఒక ప్లేట్‌లో బ్రెడ్ క్రంబ్స్‌కి ఉప్పు, మిరియాల పొడిని కలిపి సిద్ధం చేసుకోవాలి. బౌల్‌లో కలిపి ఉంచుకున్న కీర దోస ముక్కల్ని శెనగపిండి బ్యాటర్‌లో ముంచి.. ఆపై సిద్ధంగా ఉన్న బ్రెడ్ క్రంబ్స్‌పై దొర్లించాలి. ఇలా కీరదోస ముక్కలన్నింటినీ సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని నూనె రాసిన ఓ బేకింగ్ ట్రేలో కాస్త గ్యాప్ ఉండేలా పేర్చుకొని.. ఈ ట్రేని అవెన్‌లో పెట్టి 180 డిగ్రీల వద్ద 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే ‘కీర దోస ఫ్రైస్’ రడీ.. వీటిని ఏదైనా చట్నీ లేదా కెచప్‌లో డిప్ చేసుకొని లాగించేస్తే మస్త్ మజాగా ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్