చూశారా.. అరవైల్లో ఇరవై అంటే ఇదేనేమో..!

ఈ రోజుల్లో చాలామంది ఓ కిలోమీటరు నడిచేసరికే కాళ్లు లాగుతున్నాయంటారు. ఎత్తైన మార్గానికి వెళ్లినప్పుడు ఒక్కసారి ఎక్కేసరికి నా వల్ల కాదని కూలబడిపోతుంటారు. కానీ కొంతమంది వయసు పైబడినా ఏమాత్రం ఉత్సాహం తగ్గకుండా యువతతో పోటీపడుతుంటారు. కర్నాటకకు చెందిన నాగరత్నమ్మ ఈ కోవకే చెందుతారు.

Updated : 22 Feb 2022 20:47 IST

(Photo: Instagram)

ఈ రోజుల్లో చాలామంది ఓ కిలోమీటరు నడిచేసరికే కాళ్లు లాగుతున్నాయంటారు. ఎత్తైన మార్గానికి వెళ్లినప్పుడు ఒక్కసారి ఎక్కేసరికి నా వల్ల కాదని కూలబడిపోతుంటారు. కానీ కొంతమంది వయసు పైబడినా ఏమాత్రం ఉత్సాహం తగ్గకుండా యువతతో పోటీపడుతుంటారు. కర్నాటకకు చెందిన నాగరత్నమ్మ ఈ కోవకే చెందుతారు. 62 ఏళ్ల వయసులో ఎత్తైన పర్వతాన్ని, అదీ చీరలోనే ఎక్కి రికార్డు సృష్టించారు. సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు. ప్రస్తుతం నాగరత్నమ్మ ట్రెక్కింగ్‌ చేసిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

కర్నాటకకు చెందిన నాగరత్నమ్మ ఎత్తైన పర్వతాల్లో ఒకటైన అగస్త్యకూడం పర్వతాన్ని అధిరోహించారు. ఇది సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో తమిళనాడు, కేరళ సరిహద్దుల్లో ఉంటుంది. దీని ఎత్తు 1890 మీటర్లు (6200 అడుగులు). ఈ పర్వతాన్ని ఆమె 62 ఏళ్ల వయసులో ఎక్కి చూపరులను ఔరా అనిపించారు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా ఇప్పటివరకు దాదాపు 9 వేల మంది లైక్‌ చేశారు. దాంతో ఈ బామ్మ ఇప్పుడు ట్రెండింగ్‌లో నిలిచారు.

ఈ సందర్భంగా వీడియోని పోస్ట్‌ చేసిన వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసుకొచ్చారు. ‘సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో అగస్త్యకూడం చాలా ఎత్తైన పర్వతం. ట్రెక్కింగ్‌ చేయడానికి కష్టమైనది కూడా. నాగరత్నమ్మ ఇటీవలే తాడు ద్వారా దీనిని అధిరోహించారు. ఆమె బెంగళూరు నుంచి తన కొడుకు, స్నేహితులతో ఇక్కడకు వచ్చారు. దీనికోసం ఆమె మొదటిసారి కర్నాటక దాటి వచ్చారు. ఆమె పెళ్లైన తర్వాత గత నలభై సంవత్సరాలుగా కుటుంబ బాధ్యతలతో బిజీగా గడిపిందని చెప్పారు. ఇప్పుడు ఆమె పిల్లలు పెద్దవాళ్లై స్థిరపడ్డాక ఆమె తన అభిరుచులను తిరిగి కొనసాగిస్తున్నారు. ఆమె శక్తికి, ఆసక్తికి ఎవరూ సరితూగరు. ఈ వీడియో చాలామందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది’ అని రాసుకొచ్చారు.


72 ఏళ్ల వయసులో..

కేవలం నాగరత్నమ్మే కాకుండా వయసు కేవలం సంఖ్య మాత్రమే అంటూ పలువురు బామ్మలు యువతలో స్ఫూర్తి నింపుతున్నారు. రెండు నెలల క్రితం కేరళకే చెందిన పారుఅమ్మ 72 ఏళ్ల వయసులో జిప్ లైనింగ్ చేసి ఔరా అనిపించారు. ఈమె కూడా చీర కట్టులోనే ఈ విన్యాసం చేయడం విశేషం. ఈ వీడియో కూడా నెట్టింట తెగ వైరలైంది. దాదాపు 47 వేల మంది ఈ వీడియోని లైక్‌ చేశారు. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి...

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్