నూనెతో తుడిచేయండి!

మేకప్‌ ఈ రోజుల్లో సాధారణం. అయితే దీన్ని వేసుకోవడానికి పెట్టిన శ్రద్ధ తొలగించడంలో చూపకపోతే చిక్కులు తప్పవు.  అందుకే ఈ సహజ చిట్కాలను పాటించండి.

Published : 05 Jul 2021 00:41 IST

మేకప్‌ ఈ రోజుల్లో సాధారణం. అయితే దీన్ని వేసుకోవడానికి పెట్టిన శ్రద్ధ తొలగించడంలో చూపకపోతే చిక్కులు తప్పవు.  అందుకే ఈ సహజ చిట్కాలను పాటించండి.

* రెండు టేబుల్‌ స్పూన్ల పాలల్లో చెంచా గులాబీ నీరు, రెండు చుక్కల ఆలివ్‌నూనె కలిపి దానిలో ముంచిన దూదితో తుడిస్తే సరి. చర్మంపై పేరుకున్న మురికి తొలగిపోతుంది.

*  రెండు చెంచాల తేనెకు చెంచా బాదం నూనె కలపాలి. ఈ మిశ్రమంపై కాస్త వంటసోడా చల్లి... అందులో తడిపిన దూదితో మేకప్‌ శుభ్రం చేయండి. సూక్ష్మక్రిముల నుంచి... మీ చర్మాన్ని పాడవకుండా కాపాడుతుంది ఈ మిశ్రమం. తేమ అంది తాజాగానూ కనిపిస్తుంది.

*  వాటర్‌ఫ్రూఫ్‌ మేకప్‌ని తొలగించడానికి ఆలివ్‌నూనె వాడండి. సులువుగా శుభ్ర పడుతుంది. చర్మం పొడి బారదు కూడా.

*  కీరదోస రసంలో చెంచా గులాబీ నూనె కలిపి ముఖానికి రాసుకున్నా అలంకరణ పోతుంది. పైగా ఇది సహజ క్లెన్సర్‌లానూ పని చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్