మలైకా మెరుపు వెనుక..

40వ పడిలోనూ చెక్కు చెదరని అందం.. మలైకా అరోరాది. తన అందం, ఆరోగ్యానికి కారణం కొబ్బరినూనెను పరగడుపున తీసుకోవడమే అంటోంది. ఇంకా.. ‘నిద్రలేవగానే గోరువెచ్చని నీరు, తేనె, కొబ్బరినూనె కలిపి తాగుతా.

Updated : 15 Dec 2021 03:57 IST

40వ పడిలోనూ చెక్కు చెదరని అందం.. మలైకా అరోరాది. తన అందం, ఆరోగ్యానికి కారణం కొబ్బరినూనెను పరగడుపున తీసుకోవడమే అంటోంది. ఇంకా.. ‘నిద్రలేవగానే గోరువెచ్చని నీరు, తేనె, కొబ్బరినూనె కలిపి తాగుతా. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా చర్మాన్నీ మెరిసేలా చేస్తుంది. రోజంతా ఉత్సాహంగానూ ఉంచుతుంది. వ్యర్థాలను బయటకు పంపి, జీవక్రియలను సమన్వయం చేస్తుంది. కొవ్వును కరిగించి, అధికబరువు సమస్యను దరిచేరనీదు. పరగడుపున దీన్ని తీసుకోవడం ఇబ్బంది అనిపిస్తే అల్పాహారం లేదా మధ్యాహ్న భోజనాన్ని కొబ్బరినూనెతో సిద్ధం చేసుకుంటే సరిపోతుంది. ఏ రూపంలో తీసుకున్నా.. ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు. పూర్తి శాఖాహారిని కావడంతో తాజా పండ్లు, గింజ ధాన్యాలు, పప్పులు వంటివాటి ద్వారా ప్రొటీన్లు అందేలా చూసుకుంటా. సేంద్రియ ఎరువులతో పండించే వాటికి ప్రాధాన్యమిస్తా. కిచిడీ అంటే ఇష్టం. రాత్రి భోజనం 6.30 గంటలకల్లా ముగిస్తా. దక్షిణ భారతదేశ వంటకాలంటే ఎక్కువ ఇష్టం. డైట్‌ పేరుతో కడుపు మాడ్చుకోవడం నాకు నచ్చదు. కడుపునిండా తిని.. దానికి తగ్గ వర్కవుట్లు చేస్తా. వారాంతాల్లో మాత్రం ఏ నియమాలూ పెట్టుకోను. ఉప్పు, చక్కెర, మైదా, గ్లుటెన్‌, పాల ఉత్పత్తులు, పాస్తాలకు దూరం. నాజూకు పేరుతో ఒత్తిడినిచ్చే నియమాలను పెట్టుకోకుండా మనసుకు నచ్చేలా ఉంటూనే ఫిట్‌గా ఉండటానికి ప్రయత్నిస్తే చాలని సలహానిస్తా. ముందు మన శరీరాన్ని మనం ప్రేమించుకోవాలి’ అని చెబుతోంది మలైకా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్