ఇది చీరల లైబ్రరీ!

ఇంట్లో వేడుకో, శుభకార్యమో అంటే... మంచి చీర కట్టుకోవాలని ఏ ఇల్లాలయినా కోరుకుంటుంది. కానీ మరీ ఖరీదెక్కువయినవి కొనాలంటే స్తోమత కూడా ఉండాలిగా! డబ్బుల్లేక సమయానికి మంచి చీర కొనుక్కోలేకపోయానే అని బాధపడే మధ్యతరగతి మహిళలకు ఆ చింత లేకుండా చేశారు వడోదరాలోని కొంతమంది స్నేహితురాళ్లు. హేమా చౌహాన్‌, సాధనాషా, నీలాషా.. వంటి స్నేహితురాళ్లంతా కలిసి ఆస్తా సహేలీ అనే బృందాన్ని ప్రారంభించారు....

Updated : 25 Dec 2021 05:30 IST

ఇంట్లో వేడుకో, శుభకార్యమో అంటే... మంచి చీర కట్టుకోవాలని ఏ ఇల్లాలయినా కోరుకుంటుంది. కానీ మరీ ఖరీదెక్కువయినవి కొనాలంటే స్తోమత కూడా ఉండాలిగా! డబ్బుల్లేక సమయానికి మంచి చీర కొనుక్కోలేకపోయానే అని బాధపడే మధ్యతరగతి మహిళలకు ఆ చింత లేకుండా చేశారు వడోదరాలోని కొంతమంది స్నేహితురాళ్లు. హేమా చౌహాన్‌, సాధనాషా, నీలాషా.. వంటి స్నేహితురాళ్లంతా కలిసి ఆస్తా సహేలీ అనే బృందాన్ని ప్రారంభించారు. వీళ్ల మాటల్లోంచి పుట్టికొచ్చిన ఆలోచనే ‘శారీ లైబ్రరీ’. దీన్ని రెండేళ్ల క్రితమే ప్రారంభించారు. పేద, మధ్యతరగతి స్త్రీలు అవసరం అయినప్పుడు కొంత డిపాజిట్‌ కట్టి శారీ లైబ్రరీ నుంచి మూడు చీరల వరకూ వేడుకల కోసం తీసుకెళ్లొచ్చు. మళ్లీ పని అయ్యాక వాటిని ఇచ్చేస్తే లాండ్రీ ఖర్చులు పోను మిగిలిన డిపాజిట్‌ని వెనక్కి ఇస్తారు. ఏడాదికోసారి జరిగే శారీ మేళాలో ఉచితంగా కూడా చీరలని అందుకోవచ్చట. మేమంతా వ్యాపారాలు చేసే మహిళలం. మధ్యతరగతి మహిళల ముఖాల్లో వెలుగులు చూడ్డానికే ఈ ఏర్పాటు చేశాం అంటున్నారు లైబ్రరీ నిర్వాహకులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్