శిరోజాలకు సెనగపిండి...

వాతావరణం మారినప్పుడల్లా ఆ ప్రభావం శరీరంతోపాటు శిరోజాలపైనా పడుతుంది. జుట్టు రాలడం, పేలవంగా కనిపించడం లేదా చివర్లు చిట్లిపోవడం జరుగుతుంది. అందుకే కాలానికి తగినట్లుగా కేశాల సంరక్షణ తప్పదంటున్నారు సౌందర్య నిపుణులు

Updated : 24 Nov 2022 16:05 IST

వాతావరణం మారినప్పుడల్లా ఆ ప్రభావం శరీరంతోపాటు శిరోజాలపైనా పడుతుంది. జుట్టు రాలడం, పేలవంగా కనిపించడం లేదా చివర్లు చిట్లిపోవడం జరుగుతుంది. అందుకే కాలానికి తగినట్లుగా కేశాల సంరక్షణ తప్పదంటున్నారు సౌందర్య నిపుణులు. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే సెనగపిండితో జుట్టును ఎలా పరిరక్షించుకోవచ్చో సూచిస్తున్నారు.

అయిదు చెంచాల సెనగపిండికి రెండేసి చెంచాల పెరుగు, ఆలివ్‌ నూనె కలిపి, ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 20 నిమిషాలు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే చాలు. ఇది మంచి కండిషనర్‌గా పని చేయడమే కాకుండా, కురులనూ బలంగా ఉంచుతుంది. పెరుగు, ఆలివ్‌నూనె మాయిశ్చరైజర్లుగా పనిచేసి జుట్టుకు మెరుపును అందిస్తాయి.

సాదా కురులకు ...

రెండు చెంచాల సెనగపిండికి అదే మోతాదులో బాదంపప్పు పొడిని, గుడ్డులోని తెలుపు సొనను విడిగా తీసి కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి కుదుళ్ల నుంచి మృదువుగా రాయాలి. ఈ ప్యాక్‌ను 30 నిమిషాలు ఉంచి, తర్వాత తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా మెరుస్తుంది.

జిడ్డుగా ఉంటే...

సెనగపిండిని రెండు చెంచాలు తీసుకొని దానికి మెత్తగా చేసిన మెంతుల పొడి, సరిపడా కొబ్బరి పాలను కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు మృదువుగా మర్దనా చేసి ఓ గంట ఆరనిచ్చి శుభ్రం చేస్తే చాలు. శిరోజాలు రాలడం తగ్గుముఖం పడుతుంది. చివర్లు చిట్లుతుంటే అరటి పండును గుజ్జుగా చేసి నాలుగు చెంచాల కొబ్బరినూనె, చెంచా గ్లిసరిన్‌, రెండు చెంచాల తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని శిరోజాలకు పూతలా వేసి షవర్‌ క్యాప్‌ పెట్టేయాలి. అరగంటాగి గోరు వెచ్చని నీటితో శుభ్రం చేస్తే చాలు. జుట్టు చివర్లు చిట్లడం తగ్గి, ఆరోగ్యంగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్