పొడవైన శిరోజాలకు రోజ్‌మేరీ..

చుండ్రు, జుట్టు రాలడం, పలచబడటం, నెరవడం వంటి సమస్యలకు రోజ్‌మేరీ ఆయిల్‌ పరిష్కారాన్నిస్తుంది అంటున్నారు నిపుణులు.మాడుపై జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ సవ్యంగా జరగనప్పుడు శిరోజాలు రాలే సమస్య మొదలవుతుంది.

Published : 21 Aug 2022 01:04 IST

చుండ్రు, జుట్టు రాలడం, పలచబడటం, నెరవడం వంటి సమస్యలకు రోజ్‌మేరీ ఆయిల్‌ పరిష్కారాన్నిస్తుంది అంటున్నారు నిపుణులు.

మాడుపై జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ సవ్యంగా జరగనప్పుడు శిరోజాలు రాలే సమస్య మొదలవుతుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండే రోజ్‌మేరీ ఆయిల్‌తో నరాలవ్యవస్థ, రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది కుదుళ్లకు రక్తాన్ని అందించడంలో దోహదపడుతుంది. ఈ నూనెలోని కార్నోసిక్‌ యాసిడ్‌ నరాలను ఉత్తేజపరిచి మాడు అంతా రక్తప్రసరణ వేగంగా జరిగేలా చేస్తుంది. చుండ్రు, దురద సహా జుట్టు త్వరగా నెరవడం వంటి సమస్యలను దూరం చేస్తుంది.

నూనెలతో...

నాలుగైదు చుక్కల రోజ్‌మేరీ ఎసెన్షియల్‌ ఆయిల్‌ను మాడుపై మృదువుగా మసాజ్‌ చేయాలి.  గుండ్రంగా వేళ్లను కదిలిస్తూ మసాజ్‌ చేస్తే రక్తప్రసరణ బాగా జరుగుతుంది. జుట్టు పెరగడానికి దోహదపడుతుంది. అయిదు చుక్కలకన్నా ఎక్కువ నూనెను వినియోగించకపోవడం మంచిది. ఎసెన్షియల్‌ నూనెలను తక్కువ మోతాదులోనే వాడాల్సి ఉంటుంది. అలాగే కొబ్బరి, బాదం, ఉసిరి వంటి నూనెలకు నాలుగుచుక్కల రోజ్‌మేరీ ఎసెన్షియల్‌ ఆయిల్‌ను కలిపి కూడా మాడుకు అప్లై చేయొచ్చు. గంటసేపు నాననిచ్చిన తర్వాత రసాయన రహితమైన షాంపుతో శుభ్రపరిస్తే చాలు. జుట్టు ఒత్తుగా అవుతుంది. అంతేకాదు, షాంపు లేదా కండిషనర్‌కు కూడా ఈ ఆయిల్‌ను కలిపి వినియోగించొచ్చు. మూడునాలుగు చుక్కల రోజ్‌మేరీ ఎసెన్షియల్‌ ఆయిల్‌ను షాంపు లేదా కండిషనర్‌కు కలిపి జుట్టును శుభ్రపరుచుకుంటే శిరోజాలు మృదువుగా మారతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్