బుగ్గలకు గులాబీ అందం!

మెరిసే ముఖానికి కెంపు రంగు అద్దుకున్న బుగ్గలు మరింత అందాన్నిస్తాయి కదూ! అందుకే మేకప్‌లో బ్లష్‌కీ ప్రాధాన్యమెక్కువ. అయితే అది సరిగా నప్పినపుడే అందం!

Published : 19 Sep 2022 00:33 IST

మెరిసే ముఖానికి కెంపు రంగు అద్దుకున్న బుగ్గలు మరింత అందాన్నిస్తాయి కదూ! అందుకే మేకప్‌లో బ్లష్‌కీ ప్రాధాన్యమెక్కువ. అయితే అది సరిగా నప్పినపుడే అందం!

* మీది లేత రంగు చర్మమనుకోండి.. పీచ్‌, రోజీ పింక్‌ మ్యాటే లేదా పౌడర్‌ బ్లష్‌లను ఎంచుకోండి. సహజ గులాబీ రంగు వచ్చేస్తుంది. పసుపు, బంగారు మేనిఛాయా? ముదురు గులాబీ, లేత నారింజ, కాపర్‌ రంగులను ఎంచుకుంటే సరి.

* చామన ఛాయ వారికి లేత రంగులు నప్పినా.. సహజంగా కనిపించాలంటే నారింజ, టెర్రాకోట, ఇటుకపొడి రంగులు ఎంచుకోవడం మంచిదట. షిమ్మర్‌వి ఎంచుకుంటే మరింత మెరిసిపోవచ్చు. బాగా నలుపు చర్మమైతే ప్లమ్‌, బర్గండీ, మెరూన్‌, ఎరుపు రంగులు నప్పుతాయి. పౌడర్‌ వాటికంటే క్రీమీ బ్లష్‌లను ఎంచుకుంటే మేలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్